Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు

అదనపు ఎస్పీ బుజ్జంగారావు, తిరుపతన్న కూడా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు...

Phone Tapping Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఆరుగురిని నిందితులుగా చేర్చారు. మార్చి 10న పోలీసులు ఆరుగురిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు.

Phone Tapping Case Update

అదనపు ఎస్పీ బుజ్జంగారావు, తిరుపతన్న కూడా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ అరెస్టులు రాజకీయ ప్రేరేపితమని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదని పిటిషనర్లు వాదించారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ, కేసు ఇంకా విచారణకు రాలేదని, అందువల్ల బెయిల్ మంజూరు చేయరాదని పిపి సమర్పించారు. ఇద్దరి బెయిల్ దరఖాస్తులపై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది.

Also Read : Malawi Plane Crash : విమానం కుప్పకూలి మాలావి దేశ ఉపాధ్యక్షుడు మృతి

Leave A Reply

Your Email Id will not be published!