Pink Ball : అబ్బా పింక్ బాల్ దెబ్బ

పేస‌ర్ల దెబ్బ‌కు ఠారెత్తిన లంక

Pink Ball  : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు – బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ మొద‌టి నుంచీ పింక్ బాల్(Pink Ball )తో మ్యాచ్ లు నిర్వించేందుకు నానా తంటాలు ప‌డుతున్నాడు. తాజాగా బెంగళూరు వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రిగిన రెండో టెస్టులో బంతికి, బ్యాట్ కు మ‌ధ్య పోరు ఆస‌క్తిక‌రంగా మారింది.

స్టార్ ఆట‌గాళ్లు క‌లిగిన భార‌త జ‌ట్టు ఉన్న‌ట్టుండి లంక బౌల‌ర్ల ధాటికి విల విల లాడింది. మొత్తంగా చూస్తే గులాబీ బంతి గిర గిరా తిప్పేస్తోంది. దీని దెబ్బ‌కు ప్ర‌ధాన బ్యాట‌ర్లు పెవిలియ‌న్ బాట ప‌ట్టారు.

ఇక టీమిండియాలో శ్రేయ‌స్ అయ్య‌ర్ , రిష‌బ్ పంత్, విహారి మాత్ర‌మే ఆ బంతితో ఆడ‌గలిగారు. స్కిప్ప‌ర్ శ‌ర్మ‌, మాజీ కెప్టెన్ కోహ్లీ సైతం ప‌రుగులు తీసేందుకు త‌డ‌బ‌డ్డారు. మొత్తంగా చూస్తే బంతి త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంది.

ఊహించ‌ని రీతిలో పిచ్ మీద స్వింగ్ అవుతోంది. క‌నీసం డిఫెన్స్ ఆడేందుకు సైతం ఛాన్స్ ఇచ్చేలా క‌నిపించ లేదు. దీంతో గులాబీ బంతి అనే స‌రిక‌ల్లా బ్యాట‌ర్లు జ‌డుసుకుంటున్నారు.

ఓ వైపు ఫ‌స్ట్ టెస్టులో దుమ్ము రేపిన టీమిండియా సెకండ్ టెస్టులో చివ‌రి దాకా త‌డ‌బ‌డింది. ఇక ప్ర‌త్య‌ర్థి శ్రీ‌లంక జ‌ట్టు సైతం ఇదే ఇబ్బందిని ఎదుర్కొంది.

భార‌త జ‌ట్టు 252 ప‌రుగుల‌కు చాప చుట్టేస్తే ఇంక లంకేయులు ఇప్ప‌టికే 6 వికెట్లు కోల్పోయి ఇక్క‌ట్ల‌లో ప‌డ్డారు. ఇంకా ఆ జ‌ట్టు టీమిండియా స్కోరు దాటాలంటే ఇంకా 162 ప‌రుగులు చేయాల్సి ఉంది.

మొత్తం మీద పింక్ బాల్ అనే స‌రిక‌ల్లా క్రికెట‌ర్లు జ‌డుసుకుంటున్నారు.

Also Read : నిల‌బ‌డిన భార‌త్ త‌డ‌బ‌డిన శ్రీ‌లంక

Leave A Reply

Your Email Id will not be published!