Pinky Irani : మ‌నీ లాండ‌రింగ్ కేసులో పింకీ ఇరానీ అరెస్ట్

సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ స‌హాయ‌కురాలు

Pinky Irani : దోపిడీ కేసులో (మ‌నీ లాండ‌రింగ్ ) కాన్ మ‌న్ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ స‌హాయ‌కురాలు పింకీ ఇరానీని అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన పింకీ ఇరానీ ఎక‌నామిక్ అఫెన్స్ వింగ్ (ఈవోడ‌బ్ల్యూ) ఆఫీసులో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీస్ అధికార ప్ర‌తినిధి సుమ‌న్ స‌ల్వా వెల్ల‌డించారు.

పింకీ ఇరానీని(Pinky Irani)  అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. మూడు రోజుల పోలీస్ క‌స్ట‌డీకి ఇచ్చింది కోర్టు. ఈ మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి క్షుణ్ణంగా విచారించేందుకు పోలీసుల‌కు స్వేచ్ఛ ఇవ్వాల‌ని పేర్కొంది.

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో స‌హా బాలీవుడ్ ప్ర‌ముఖ‌ల‌తో స‌మావేశానికి పింకీ ఇరానీ స‌హ‌క‌రించార‌ని తెలిపింది ఈడీ. ఇదే స‌మ‌యంలో ఫిర్యాదుదారు , ఇత‌ర వ‌న‌రుల నుండి దోపిడీ చేసిన డ‌బ్బుల‌ను చేర వేయ‌డంలో కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ పేర్కొంది.

మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి పూర్తి నివేదిక‌ను ఈడీ కోర్టుకు స‌మ‌ర్పించింది. స‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతోంద‌ని ఈడీ పేర్కొంది. ప్ర‌స్తుతం జైలులో ఉన్న చంద్ర‌శేఖ‌ర్ , ఫోర్టిస్ హెల్త్ కేర్ మాజీ ప్ర‌మోట‌ర్ శివింద‌ర్ మోహ‌న్ సింగ్ భార్య ఆదితి సింగ్ వంటి ప్ర‌ముఖ వ్య‌క్తుల‌తో స‌హా ప‌లువురిని మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి.

ప్ర‌ధాన నిందితుడు చంద్ర‌శేఖ‌ర్ తో చాలా కాలం నుంచి ట‌చ్ లో ఉంద‌ని , అత‌ని నేర కార్య‌క‌లాపాల గురించి పింకీ ఇరానీకి తెలుస‌ని పేర్కొంది ఈడీ. ఆమె కేసు విచారించిన ప్ర‌త్యేక న్యాయ‌మూర్తి శైలేంద‌ర్ మాలిక్ డిసెంబ‌ర్ 3 వ‌ర‌కు ఇరానీని క‌స్ట‌డీకి పంపారు.

Also Read : ఈడీ విచార‌ణ‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ

Leave A Reply

Your Email Id will not be published!