Ex MLA Dorababu : వైసీపీకి రాజీనామా చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే

అయితే తాజాగా పెండెం దొరబాబు ప్రకటనతో ఉత్కంఠకు తెరదించినట్లయ్యింది...

Ex MLA Dorababu : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యత సరైన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు తెలిపారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఎలాంటి పదవులు ఆశించడం లేదని, ప్రజలకు మంచి జరగాలన్నదే తన కోరిక అని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ వీడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కొంత మంది వాటిని కొట్టిపారేయగా మరికొంతమంది నిజమే అంటూ నియోజకవర్గంలో చర్చించుకున్నారు.

అయితే తాజాగా పెండెం దొరబాబు(Ex MLA Dorababu) ప్రకటనతో ఉత్కంఠకు తెరదించినట్లయ్యింది. టీడీపీ, జనసేన, బీజీపీ కూటమిలోని ఏదో ఒక పార్టీలో తాను చేరుతానని మాజీ ఎమ్మెల్యే దొరబాబు స్పష్టం చేశారు. అన్నీ పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయని, అనుచరులతో చర్చించిన తర్వాతే భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో 25ఏళ్లుగా మమేకమై ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తన వెంట ఇప్పటివరకూ నడిచిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని చెప్పారు. పిఠాపురంలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించారు.

Ex MLA Dorababu Resign..

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడగా ఇప్పుడు ఆ లిస్టులో పెండెం దొరబాబు(Ex MLA Dorababu) చేరారు. 2024ఎన్నికల్లో తనకు కాదని పిఠాపురం నియోజకవర్గం సీటు వంగా గీతకు ఇవ్వడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. వంగా గీతపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 70వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడంతోనే వైసీపీకి రాజీనామా చేసినట్లు దొరబాబు వెల్లడించారు. రో వైసీపీ ముఖ్య నేత మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో ఆయన చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన శిద్ధా రాఘవరావు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. తర్వాత 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

అనంతరం వైసీపీ(YSRCP)లో చేరి 2024ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయనకు మెుండి చేయి చూపించడంతో ఇటీవల రాజీనామా చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య సైతం ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతు తెలిపారు. 2014 ఎన్నికల్లో జగన్ ఆయనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు. మనస్తాపం చెంది పార్టీని వీడారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య సైతం ఈ మధ్యనే ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు. రోశయ్య ఇటీవల గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. కూటమి భారీ సీట్లు గెలుచుకోవడంతో ఆయన కూడా కూటమి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : Union Minister Kishan Reddy : పంద్రాగస్టు తర్వాత నగరాబివృద్ది షురూ..

Leave A Reply

Your Email Id will not be published!