PK VS SK : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇంకా అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు టైం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలన్నీ ముందస్తుగా సన్నద్దం అయ్యాయి.
ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ , పవర్ లో ఉన్న టీఆర్ఎస్ , భారతీయ జనతా పార్టీ బరిలో ఉన్నాయి.
ఉద్యమ నేపథ్యం నుంచి పార్టీగా తీర్చిదిద్ది రాష్ట్రాన్ని ఏర్పాటు అయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత సీఎంగా రెండోసారి కొలువుతీరారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో గులాబీకి వ్యతిరేకత ఎదురవుతోంది. రాష్ట్రంలో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ ఈరోజు వరకు భర్తీ చేయక పోవడం కొంత ఇబ్బందికరంగా మారింది.
భారత దేశ రాజకీయాలలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా పేరుంది కేసీఆర్ కు(PK VS SK). సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర ఆయనది.
ఆయనే అతి పెద్ద వ్యూహకర్త. కానీ ఉన్నట్టుండి ఎందుకనో టీఆర్ఎస్ ఊహించని రీతిలో ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పేరొందిన ప్రశాంత్ కిషోర్(PK VS SK) ను నియమించుకుంది.
ఇప్పటికే ఆయన రంగం లోకి దిగాడు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి, అ
భ్యర్థులు, ఎమ్మెల్యేల పర్ ఫార్మెన్స్ గురించి పూర్తి నివేదికను సీఎం కేసీఆర్ కు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక ఈసారి ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ , బీజేపీ శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదే సమయంలో ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ పీకేతో కలిసి పని చేసిన మరో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలును నియమించుకుంది. ఆయన కూడా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి పూర్తి నివేదిక తయారు చేసినట్టు సమాచారం.
త్వరలో ఏఐసీసీకి రిపోర్టును సమర్పించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని, సమస్యలను ప్రస్తావిస్తూనే ప్రజల్లో ఉండేలా చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని టాక్.
ప్రస్తుతం ఇద్దరు రాజకీయ వ్యూహకర్తల మధ్య అసలైన యుద్దం ప్రారంభం కావడం విశేషం. ఓ వైపు పీకే మరో వైపు ఎస్కేల మధ్య వార్ నడుస్తోందన్నమాట.
మరి ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ ను గట్టెక్కిస్తాడా లేక సునీల్ కనుగోలు కాంగ్రెస్ ను రక్షిస్తాడా అన్నది త్వరలో తేలనుంది. మొత్తంగా చూస్తే మాత్రం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత మాత్రం ప్రభుత్వానికి ఉందన్నది వాస్తవం.
Also Read : రంగుల లోకంలో వరలక్ష్మి స్పెషల్