Prashant Kishor : రాహుల్ యాత్రపై పీకే షాకింగ్ కామెంట్స్
గుజరాత్ నుంచి స్టార్ట్ చేస్తే బావుండేది
Prashant Kishor : భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్ల మేర చేపట్టారు.
150 రోజుల పాటు కొనసాగనుంది. రాహుల్ యాత్ర తమిళనాడు నుంచి కాకుండా దేశంలో త్వరలో ఎన్నికలు జరగబోయే గుజరాత్, మధ్య ప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రారంభించి ఉంటే బాగుండేదన్నారు ప్రశాంత్ కిషోర్.
ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా పీకే ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ ఏడాది పీకే కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆయన గాంధీ ఫ్యామిలీలోని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో వరుసగా భేటీ అయ్యారు.
కానీ తర్వాత ఎందుకనో పీకే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎన్నికల వ్యూహానికి నాయకత్వం వహించే ప్రతిపాదనను తిరస్కరించినట్లు తానే స్పష్టం చేశాడు.
ఇదిలా ఉండగా విదర్భ అనుకూల మద్దతుదారులతో సంభాషిస్తూ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసుకునేందుకు ఈ ప్రాంత ప్రజలు ఐక్యంగా కృషి చేయాలని ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా తూర్పు మహారాష్ట్ర ప్రాంతానికి రాష్ట్ర హోదా సాధించేందుకు వ్యూహాన్ని రూపొందించేందుకు గాను భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ దేశ్ ముఖ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజలకు ఆశ ఉంటే ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఆలోచనను కొనసాగించ వచ్చని అభిప్రాయపడ్డారు ప్రశాంత్ కిషోర్.
Also Read : మోదీ పాలనలో గంటకో రైతు ఆత్మహత్య