PM Modi Anthony IND vs AUS : మోదీ ఆంటోనీకి ఘ‌న స్వాగ‌తం

పెద్ద ఎత్తున హాజ‌రైన ప్రేక్ష‌కులు..భారీ స్పంద‌న

PM Modi Anthony IND vs AUS : గుజ‌రాత్ లోని న‌రేంద్ర మోదీ అహ్మ‌దాబాద్ స్టేడియంకు గురువారం చేరుకున్నారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి ఆంథోనీ ఆల్బ‌నీస్. భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇవాళ ఉద‌యం స్టేడియం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్ర‌ధాన మంత్రి ఆంథోనీ ఆల్బ‌నీస్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Modi Anthony IND vs AUS), గుజ‌రాత్ సీఎం. ఈ సంద‌ర్భంగా ఆంథోనీ ఆల్బ‌నీస్ ప్ర‌ధాని మోదీని ఆలింగనం చేసుకున్నారు. ప్ర‌త్యేకంగా అభినందించారు.

భార‌త దేశానికి స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్ల‌వుతోంది. ఆజాద్ కీ అమృత్ మ‌హోత్సవ్ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రపంచ క్రికెట్ లో భారీ ఎత్తున కోట్లాది రూపాయ‌ల‌తో అహ్మ‌దాబాద్ స్టేడియంను పున‌ర్ నిర్మించారు. ఇదిలా ఉండ‌గా భార‌త్ లో ఆస్ట్రేలియా(IND vs AUS) క్రికెట్ జ‌ట్టు ప‌ర్య‌టిస్తోంది.

ఇప్ప‌టికే మూడు టెస్టులు జ‌రిగాయి. ఇది కీల‌క‌మైన నాలుగో టెస్టు. నాగ్ పూర్ , ఢిల్లీలో జ‌రిగిన మొద‌టి, రెండవ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. ఇక మూడో టెస్టులో ఊహించ‌ని రీతిలో భార‌త జ‌ట్టును భారీ తేడాతో ఓడించింది ఆస్ట్రేలియా. 9 వికెట్ల తేడాతో ఆసిస్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

గురువారం అహ్మ‌దాబాద్ లో కీల‌క‌మైన నాలుగో టెస్టు కొన‌సాగ‌నుంది. ఈ స్టేడియంలో ల‌క్షా 10 వేల మంది ఒకేసారి మ్యాచ్ ను చూసేందుకు వీలుంది. భార‌త్ ఆస్ట్రేలియా దేశాల మ‌ధ్య గ‌త కొన్నేళ్లుగా బంధం కొన‌సాగుతోంది. ఇరు దేశాల మ‌ధ్య క్రికెట్ సంబంధాలు కొన‌సాగించేందుకు వీలుగా ఇరు దేశాల‌కు చెందిన ప్ర‌ధానులు హాజ‌ర‌య్యారు.

Also Read : నాలుగో టెస్టుకు భార‌త్ ఆసిస్ సై

Leave A Reply

Your Email Id will not be published!