PM Modi : యువత దేశం కోసం అంకితం కావాలి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
PM Modi : దేశ భవిష్యత్తు యువతపై ఉందని, వారంతా తమ జీవితాలను దేశాభివృద్ధి కోసం అంకితం చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్బంగా ఆగస్టు 15న దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. యువత తలుచుకుంటే దేనినైనా సాధించగలరన్నారు. ఇందుకు ఉదాహరణ ఐటీ రంగమేనని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
2047 నాటికి దేశం కోసం స్వాతంత్ర సమర యోధుల కలలను నెరవేర్చేందుకు ప్రజలు సన్నద్దం కావాలని కోరారు. 25 ఏళ్లలో దేశం అభివృద్ది చెందిన దేశంగా మారాలన్నారు.
నేను యువతను రాబోయే సమున్నత భారతం కోసం అంకితం కావాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ. మనం ఇతరుల లాగా మారేందుకు ప్రయత్నం చేయకూడదన్నారు.
మన ఆలోచనల్లో బానిసత్వం జాడ ఉండ కూడదన్నారు. కొన్నిసార్లు మన ప్రతిభకు భాషా పరమైన అడ్డంకులు ఎదురవుతాయని అన్నారు. అయినా మనం బాధపడ కూడదన్నారు మోదీ.
మన దేశంలోని ప్రతి బాష గురించి మనం గర్వ పడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మనం ప్రపంచం నుండి గుర్తింపును కోరుకోకూడదని చెప్పారు.
గర్వించ దగిన దేశంగా మన గుర్తింపును కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. మన సమున్నత దేశ వారసత్వం గురించి మనం గర్వపడాలన్నారు ప్రధాన మంత్రి.
మన మూలలతో మనం అనుసంధానం అయినప్పుడు మాత్రమే మనం మరింత ముందుకు వెళ్లగలమని అన్నారు నరేంద్ర మోదీ. యావత్ ప్రపంచం మన వైపు చూసేలా కృషి చేయాలని కోరారు.
Also Read : మహిళలు లేకపోతే దేశం లేదు – మోదీ