PM Modi Tour : అస్సాంకు చేరుకున్న పీఎం మోదీ
రూ. 14,300 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
PM Modi Tour : దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ శుక్రవారం అస్సాంకు చేరుకున్నారు. ఆయనకు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ. 14,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బ్రహ్మపుత్ర డాక్టర్ భూపేన్ హజారికా అమర గీతం ప్రతి అస్సామీ ప్రజల మనోభావాలను ప్రతిధ్వనిస్తుందంటూ పేర్కొన్నారు ప్రధానమంత్రి. బిహూను జరుపుకునేందుకు తాను కూడా వెళుతున్నానంటూ తెలిపారు .
ఇందులో భాగంగా 10,000 మందికి పైగా బిహూ నృత్యకారుల ప్రదర్శనను తిలకించనున్నారు నరేంద్ర మోదీ(PM Modi Tour). తన పర్యటన సందర్భంగా ప్రధానమత్రి సరుసజై స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 14,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రాంరభిస్తారు. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేస్తారు. దేశానికి అంకితం చేస్తారు.
నామ్ రూప్ లో 500 టీపీడీ మెంథాల్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు. పలాష్ బరి, సుల్ కు చిలను కలుపుతూ బ్రహ్మపుత్ర నదిపై వంతెన, రంగ్ ఘర్, శివసాగర్ సుందరీకరణ పనులు కూడా ఉన్నాయి. వీటితో పాటు అస్సాం అడ్వాన్స్ డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్ స్టిట్యూట్ కి శంకుస్థాపన చేస్తారు పీఎం. అర్హులైన లబ్దిదారులకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కార్డులను పంపిణీ చేస్తారు.
Also Read : అధికార దుర్వినియోగం రాజ్యాంగ వ్యతిరేకం