PM Modi : సింగరేణిని ప్రైవేటీకరించం – మోదీ
ఆ హక్కు కేంద్రానికి లేదన్న పీఎం
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఆరు నూరైనా సరే సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. శనివారం రామగుండంలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి(PM Modi) పాల్గొని ప్రసంగించారు. కొందరు చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయబోమంటూ పేర్కొన్నారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. సింగరేణిలో 51 శాతం తెలంగాణ రాష్ట్రానికి వాటా ఉందన్నారు. తమకు దానిని అమ్మేందుకు గాను ప్రైవేటీకరించేందుకు అధికారం లేదని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. ఇందులో కేంద్రానికి 49 శాతం వాటా ఉందన్నారు.
సింగరేణి బొగ్గు గనుల కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అబద్దాలను, పుకార్లను నమ్మ వద్దంటూ కోరారు పీఎం. సింగరేణిలో గతంలో అనేక స్కాంలు జరిగాయని ఆరోపించారు.
ఇదిలా ఉండగా కొంత కాలంగా ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇక నుంచి కష్టాలు ఉండవన్నారు నరేంద్ర మోదీ. ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడే వాళ్లమని కానీ నేటి నుంచి ఆ ఇబ్బంది, బెంగ ఉండదన్నారు ప్రధానమంత్రి(PM Modi) .
దేశంలో గోరఖ్ పూర్ , రామగుండంతో పాటు మరో ఐదు ప్రాంతాలలో ఎరువుల ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. దీని వల్ల ఇవాళ ప్రపంచానికి భారత దేశం ఎరువులను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందన్నారు ప్రధానమంత్రి. హైదరాబాద్ లో కొందరికి నిద్ర పట్టదన్నారు మోదీ.
దేశానికి సరిపడా ఎరువులను ఉత్పత్తి చేస్తున్నారని కొనియాడారు. రైతుల కోసం ఇప్పటి వరకు 10 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు నరేంద్ర మోదీ.
Also Read : భారత్ సూపర్ పవర్ ఖాయం – గోయల్