PM Modi Comment : మోదీని ఎవరైనా కాదనగలరా
పార్టీలో ఆయనే సుప్రీం..కింగ్ మేకర్
PM Modi Comment : భారత దేశంలో ఉక్కు సంకల్పం కలిగిన నాయకురాలిగా ఇందిరా గాంధీకి పేరుండేది. రాను రాను భారత దేశ చరిత్రలో గాంధీ, నెహ్రూ, పటేల్ ఇలా చెప్పుకుంటూ గత వారసత్వం కనిపించకుండా పోతోంది.
చూస్తే ఇది ఓ పద్దతి ప్రకారం జరుగుతూ వస్తోందనిపిస్తోంది. ఇండియా అంటే ఇందిర అనేంతగా ఎదిగిన నాయకురాలు ఆమె. ఆ తర్వాత దేశ
రాజకీయాలలో ఇప్పుడు నరేంద్ర మోదీ (PM Modi) శకం నడుస్తోంది.
ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇదే వాస్తవం కూడా. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అభిప్రాయం ఉండేది.
చాలా మంది నాయకులు ఆర్ఎస్ఎస్ మూలాల్లోంచి వచ్చిన వారే కావడం కూడా ప్రధాన కారణం. 2014 నుంచి దేశంలో సీన్ మారింది. కాషాయం కొలువు తీరింది.
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా కొలువు తీరాక బీజేపీ స్వరూపం , పంథా, వ్యూహం, లక్ష్యం, మార్గం, ప్లాన్ అన్నీ మారాయి. కొత్త రూపు సంతరించుకుంది.
పూర్తిగా సంప్రదాయ పద్ధతిని అనుసరిస్తూ వస్తున్న పార్టీకి అనూహ్యంగా ఆధునిక జవసత్వాలను తొడిగారు నరేంద్ర మోదీ(PM Modi) .
ఆయనకు అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్న ఏకైక వ్యక్తి ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం మంత్రి అమిత్ చంద్ర షా. చీమ చిటుక్కుమన్నా
దేశంలోని బీజేపీ లో మోదీకి తెలిసి పోతుంది.
అంతలా టెక్నాలజీని వాడుకుంటోంది. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్ గా తనను తాను ఎమర్జ్ చేసుకోవడంలో మోదీ సక్సెస్ అయ్యారు.
ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు గాక కానీ మొత్తంగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దేశానికి ప్రధాన
మంత్రిగా ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటున్నారు.
ఇందులో భాగంగా అటు స్వంత పార్టీలోనూ తనకు ఎదురే లేకుండా చేసుకుంటూ వచ్చారు. ఒకప్పుడు ఇందిర అంటే కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ అంటే ఇందిరగా పాపులర్ అయ్యారు.
ఇప్పుడు భారత దేశంలో బీజేపీ అంటేనే మోదీ. మోదీ అంటేనే బీజేపీ. ఆనాటి తరం లేదు. కేవలం చెప్పుకునేందుకు మాత్రమే. తాజాగా మోదీ త్రయం (మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ) నడుస్తోంది.
ప్రధాని ఆలోచిస్తారు. సవ్యసాచి చూసొస్తారు. ఆ తర్వాత ప్లాన్ అమలవుతుంది. గేమ్ లో సక్సెస్ మాత్రమే మిగులుతుంది. ఇదే సూత్రం కంటిన్యూగా నడుస్తూ వస్తోంది.
తాజాగా బీజేపీలో ఏ ఒక్కరూ పల్లెత్తు మాట మాట్లాడేందుకు , ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు ఆస్కారం లేదు. అడపా దడపా ఇద్దరు ముగ్గురు తప్పా.
మొత్తం మోదీ కనుసన్నలలో ఉండాల్సిందే. లేక పోతే నీడ కూడా దొరకని పరిస్థితి. తాజాగా ప్రకటించిన పార్లమెంటరీ బోర్డులో అనూహ్యంగా గడ్కరీ, యోగి ఆదిత్యానాథ్ కు (Yogi Adityanath) చోటు దక్కలేదు.
ఇది కూడా మోదీ వ్యూహంలో భాగం అనుకోవాలా లేక పార్టీ నిర్ణయం అని భ్రమ పడాలా అన్నది ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా మోదీని
కాదనగలమా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. దానికి మోదీనే సమాధానం చెప్పాలి.
Also Read : బిల్కిస్ దోషుల విడుదలపై మాజీ జడ్డీ ఫైర్