PM Modi : న్యూఢిల్లీ – యావత్ భారత దేశం గర్వించేలా ఆడారంటూ రోహిత్ సేన జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా మోతేరా స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టుపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది.
PM Modi Praises
ఆట అన్నాక గెలుపు ఓటములు సహజమని, ఏది ఏమైనా టీమిండియా చివరి దాకా పోరాడిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి(PM Modi). ట్విట్టర్ వేదికగా సోమవారం స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు యావత్ జాతిని ప్రభావితం చేసేలా గొప్పగా, స్పూర్తి దాయకంగా నిలిచేలా ఆడారంటూ పేర్కొన్నారు.
140 కోట్ల మంది భారతీయులు టీమిండియా గెలవాలని కోరుకున్నారని, కానీ మనందరి ఆశలపై ఆసిస్ జట్టు నీళ్లు చల్లిందని తెలిపారు. ప్రత్యర్థి జట్టు అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిందని పేర్కొన్నారు మోదీ.
ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ లో భారత్ టాస్ ఓడి పోయి ముందుగా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 240 పరుగులకు చాప చుట్టేసింది. రోహిత్ శర్మ , కోహ్లీ, కేఎల్ రాహుల్ తప్పితే ఎవరూ రాణించ లేదు.
అనంతరం బరిలోకి దిగిన ఆసిస్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 241 రన్స్ తో దుమ్ము రేపింది. లబూషేన్ 58 రన్స్ చేస్తే ట్రావిస్ హేడ్ 137 పరుగులతో ఆకట్టుకున్నారు.
Also Read : Eatala Rajender : దోపిడీకి చిరునామా బీఆర్ఎస్ పాలన