PM Modi : నీరజ్ చోప్రాకు ప్రధాని అభినందన
అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో స్వర్ణం
PM Modi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఫైనల్ లో పాకిస్తాన్ ఆటగాడిని ఓడించి విశ్వ విజేతగా నిలిచాడు. ఈ సందర్శంగా పీఎం నీరజ్ చోప్రాను అభినందించారు. ఆట పట్ల అంకితభావం , ఖచ్చితత్వం, గెలవాలన్న తపన, అలపెరుగని రీతిలో చేసిన కృషికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు.
PM Modi Appreciates Neeraj Chopra
సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన నీరజ్ చోప్రాను ప్రశంసలతో ముంచెత్తారు. నిన్న చంద్రుడి వద్దకు భారత్ చేరుకుందని , ఇవాళ దేశానికి గర్వ కారణంగా నీరజ్ చోప్రా నిలిచాడని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi).
అసమాన ప్రతిభా నైపుణ్యం కలిగిన నీరజ్ ను చూసి నేర్చు కోవాల్సింది చాలా ఉందన్నారు . ఇదిలా ఉండగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించాడు. బంగారు పతకాన్ని సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. బుడాపెస్ట్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నీరజ్ చోప్రా 88.17 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ ను పొందాడు.
పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీమ్ ను క్లోజ్ ఫైట్ లో ఓడించాడు. ఇక అర్షద్ నదీమ్ 87.82 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారం బుడా పెస్ట్ లోని నేషనల్ అథ్లెటిక్స్ సెంటర్ లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ జరిగింది.
Also Read : Nara Lokesh : ఇసుక మాఫియా కింగ్ జగన్
