Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఏపీ రాష్ట్రం ఇసుక మాఫియా మయమైందని ఆరోపించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. తమ హయాంలో ఇసుక లారీ రూ. 1500కు దొరికేదన్నారు. కానీ ప్రస్తుతం జగన్ రెడ్డి హయాంలో ఇసుక లారీ కావాలంటే కనీసం రూ. 5000 కు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Nara Lokesh Slams CM Jagan
రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు. అందుకే జగన్ రెడ్డిని ఇసుకాసురుడు అంటున్నానని అన్నారు నారా లోకేష్(Nara Lokesh). తేది 25 ఏప్రిల్ 2023న జేపీ వెంచర్స్ తో ఒప్పందం ముగిసిందని, జీఎస్టీ నెంబర్ సస్పెండ్ అయ్యిందని కానీ అదే కంపెనీ పేరుతో ఇసుక అమ్మకాలు ఎలా జరుగుతున్నాయంటూ ప్రశ్నించారు.
సొమ్మంతా తింటున్న పెద్ద పందికొక్కు జగన్ రెడ్డి కాదా అంటూ నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. పేదలకు ఉచితంగా దక్కాల్సిన ఇసుకను అడ్డగోలుగా అమ్మకాలకు తెర లేపిన జగన్ కు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రజలు అంతా గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు నారా లోకేష్. తాము పవర్ లోకి వస్తామని జగన్ తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షిస్తామన్నారు.
Also Read : TDP Slams : జగన్ అడుగు పెడితే అరిష్టం
