TDP Slams : ఏపీలో టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా టీడీపీ కీలక ప్రకటన చేసింది. ఈమేరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఆయన విశాఖ పట్నంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అంతేకాదు ఏపీకి రాజధానిక ఇక విశాఖనేనంటూ ప్రకటించారు.
TDP Slams AP CM YS Jagan
వచ్చే నెలాఖరు నాటికి తాను విశాఖ కేంద్రంగా పాలనను ప్రారంభిస్తానని ఇప్పటికే వెల్లడించారు ఏపీ సీఎం. ఇదిలా ఉండగా జగన్ రెడ్డి ఎక్కడ కాలు మోపినా అదంతా అరిష్టమేనని ఎద్దేవా చేసింది. అంతే కాదు సీఎం కన్ను పడిందో ఇక భస్మమేనని మండిపడింది తెలుగుదేశం పార్టీ(TDP).
విశాఖకు జగన్ వస్తానంటూ మాట్లాడిన ప్రతిసారి నగరంలో ఎదో ఒక ఉప్రదవం వచ్చి పడుతోందని మండిపడింది. ఆయన ప్రకటన చేయడం నగరంలో ఏదో ఒకటి కూలి పోవడం జరుగుతోందని ఆరోపించింది.
ప్రకృతిని ధ్వంసం చేసే జగన్ పాదం విశాఖలో అడుగు పెట్టడం చివరకు విశాఖ నగరం కూడా ఇష్ట పడడం లేదంటూ పేర్కొంది. నగరంలో మరో ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపించింది. జగన్ మోహన్ రెడ్డి ఫోటో పెట్టి కట్టిన బస్ బే 3 నెలలకే కుప్ప కూలిందని ఎద్దేవా చేసింది.
Also Read : Revanth Reddy : కేసీఆర్ ఖేల్ ఖతం – రేవంత్ రెడ్డి
