Revanth Reddy : కేసీఆర్ ఖేల్ ఖతం – రేవంత్ రెడ్డి
దళిత, గిరిజన జీవితాల్లో పెను మార్పు
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఖేల్ ఇక చెల్లదంటూ స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇంకెంత కాలం మాయ మాటలు చెబుతూ బురిడీ కొట్టిస్తాడంటూ ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్న దొర మరిచి పోయాడని ఎద్దేవా చేశారు.
Revanth Reddy Comments on KCR
తమ పార్టీ తీసుకు వచ్చిన ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ ప్లాన్ దేశంలోనే అత్యుత్తమమైనదని పేర్కొన్నారు. ఈ డిక్లరేషన్ ను పవర్ లోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని నిట్ట నిలువునా మోసం చేశాడని ఎద్దేవా చేశారు.
ఓ వైపు బంగారు తెలంగాణ అనుకుంటూ జనాన్ని మభ్య పెడుతున్నాడని ధ్వజమెత్తారు. రాస్ట్రంలో 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. తమ డిక్లరేషన్ దళిత, గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకు వస్తుందని చెప్పారు.
దళితుడిని సీఎం చేస్తానని, కాపలా కుక్క లాగా ఉంటానన్న సీఎం ఇవాళ ఏడున్నాడని ప్రశ్నించారు. గిరిజనులకు 12 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తానన్న కేసీఆర్ మోసం చేశాడని అన్నారు. మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసిన ఘనమైన చరిత్ర తెలంగాణ సర్కార్ కు దక్కుతుందన్నారు.
Also Read : Ramachandra Rao : మైనంపల్లిని బీజేపీలో చేర్చుకోం
