Ramachandra Rao : మైనంప‌ల్లిని బీజేపీలో చేర్చుకోం

మాజీ ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావు

Ramachandra Rao : భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత రావు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న బీజేపీ పార్టీలోకి వ‌స్తే తాము చేర్చుకోబోమంటూ స్ప‌ష్టం చేశారు.

Ramachandra Rao Shocking Comments

రాంచంద‌ర్ రావు మీడియాతో మాట్లాడారు. గ‌తంలో త‌మ పార్టీకి చెందిన కరీంన‌గ‌ర్ ఎంపీ, రాష్ట్ర మాజీ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ ను అన‌రాని మాట‌లు అన్నాడ‌ని, నోటికి వ‌చ్చిన‌ట్లు తిట్టాడ‌ని ఇప్పుడు ఎలా పార్టీలోకి వ‌స్తామంటే చేర్చుకుంటామ‌ని ప్ర‌శ్నించారు .

ఆయ‌న కాషాయ పార్టీ కండువా క‌ప్పుకోబోతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై తాజాగా స్పందించారు మాజీ ఎమ్మెల్సీ రాం చంద‌ర్ రావు(Ramachandra Rao). గ‌తంలో మైనంప‌ల్లి హ‌నుమంత రావు త‌మ పార్టీ అగ్ర నాయ‌కుల‌ను దూషించాడు.

మా పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను టార్గెట్ చేశాడు. వాళ్ల‌పై కేసులు న‌మోదు చేయించాడ‌ని ఆరోపించారు. అంతే కాదు వాళ్ల‌ను జైలుకు పంపించేంత దాకా వ‌ద‌ల లేద‌న్నారు. అలాంటి నేత‌ల‌కు త‌మ పార్టీలో చోటు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు మాజీ ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావు.

Also Read : Tirumala Heavy Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.02 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!