Tirumala Heavy Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.02 కోట్లు
దర్శించుకున్న భక్తుల సంఖ్య 79,152
Tirumala Heavy Rush : పవిత్రమైన పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుండి స్వామి వారి దర్శనం కోసం తరలి వచ్చారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. ముందు జాగ్రత్తగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేసింది.
Tirumala Heavy Rush with Devotees
శ్రీనివాసుడిని 79 వేల 152 మంది భక్తులు దర్శించుకున్నారు. 30 వేల 229 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.02 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) వెల్లడించింది.
తిరుమల లోని 25 కంపార్ట్ మెంట్లలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామి దర్శనం కోసం వేచి ఉన్న వారి సంఖ్య కనీసం 15 గంటలకు పైగా పట్టే అవకాశం ఉందని తెలిపింది.
సామాన్యులకు దర్శన భాగ్యం కల్పించేందుకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి.
Also Read : Snapana Tirumanjanam : తిరుమలలో స్నపన తిరుమంజనం
