PM Modi : ప్రధాని మోదీపై 6 ఏళ్ల నిషేధం విధించాలంటూ సుప్రీంలో పిర్యాదు
ఫాతిమా అనే మహిళ అటార్నీ ఆనంద్ ఎస్. జోండాలే ద్వారా ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది....
PM Modi : ఎన్నికల ప్రచారంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆరేళ్ల పాటు ప్రచారం చేయకుండా నిషేధించాలని పిటిషన్ దాఖలైంది. అయితే దీనిని మంగళవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి విషయాలపై ఎన్నికల కమిషన్‌ను సంప్రదించాలని కోర్టు సూచించింది. దీంతో వాదులు తమ పిటిషన్లను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
PM Modi Got Case
ఫాతిమా అనే మహిళ అటార్నీ ఆనంద్ ఎస్. జోండాలే ద్వారా ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ప్రచారంలో ప్రధాని మోదీ(PM Modi) విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రధాని మోదీని ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ విక్రమనాథ్, ఎస్‌సి శర్మ నేతృత్వంలోని ధర్మాసనం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు.
అసలు మీరు ఎన్నికల అధికారులను సంప్రదించారా? మాండమస్ రిట్ పొందాలంటే ముందుగా అధికారులను సంప్రదించాలి” అని కోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి పిటిషనర్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో ప్రధాని మోదీపై ఢిల్లీ హైకోర్టులో కూడా ఇలాంటి ఫిర్యాదు దాఖలైంది. కోర్టు కూడా దానిని తిరస్కరించింది.
Also Read : Swati Maliwal : ఎట్టకేలకు స్వాతి మలివాల్ ఆరోపణలపై స్పందించిన ఆప్ సర్కార్