PM Modi : 25 ఏళ్లలో ప్రపంచంలో భారత్ టాప్
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
PM Modi : రాబోయే 25 సంవత్సరాలలో ప్రపంచంలోనే భారత దేశం అగ్రస్థానంలో నిలవడం ఖాయమని జోష్యం చెప్పారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
అన్ని రంగాలలో ఇండియా తనదైన ముద్ర వేస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు ప్రధాన మంత్రి(PM Modi ).
భారత జాతిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశానికి స్వేచ్ఛ లభించి ఇన్నేళ్లవుతున్నా చరిత్ర చాలా మంది యోధులను విస్మరించిందన్నారు. ఇది తనను బాధ పెట్టిందన్నారు.
అందుకే చరిత్ర విస్మరించిన యోధులను స్మరించు కుంటున్నామని చెప్పారు. యావత్ జాతి ఇవాళ అమర వీరులకు, స్వాతంత్ర సమర యోధులను తలుచు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
యావత్ ప్రపంచం మొత్తం భారత దేశం వైపు చూస్తోందన్నారు. ఏదో ఒక రోజు ఇండియా ఫస్ట్ అని అన్ని దేశాలు గుర్తించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆ ప్రగాఢ విశ్వాసం తనకు ఉందన్నారు నరేంద్ర మోదీ.
భారతీయ సంస్కృతి , నాగరికత గొప్పదని దీనిని యావత్ ప్రపంచం చూసి నేర్చుకుంటోందన్నారు. రుషులు, యోగులు, తాత్వికులు, యోధులు జన్మించిన గొప్ప నేల ఈ భారత దేశమని ప్రశంచించారు ప్రధాన మంత్రి.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళలను గౌరవిస్తున్న ఏకైక దేశం మనదేనన్నారు నరేంద్ర మోదీ. వాళ్లు లేకుండా ఈ దేశం లేనే లేదన్నారు. యావత్ భారతం ఇవాళ టెక్నాలజీ, డిజిటల్, తదితర రంగాలలో ముందంజలో ఉందన్నారు.
Also Read : యువత దేశం కోసం అంకితం కావాలి