PM Modi : స్మృతి వాన్ ను ప్రారంభించిన మోదీ

గుజ‌రాత్ లోని క‌చ్ లో 476 ఎక‌రాల్లో ఏర్పాటు

PM Modi : ప్ర‌పంచంలోనే అతి పెద్ద భూకంపంగా పేరొందిన ఏకైక ఘ‌ట‌న గుజ‌రాత్ రాష్ట్రంలోని క‌చ్. ఈ ఘ‌ట‌న‌లో 13,000 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంద‌ర్భంగా 476 ఎక‌రాల విస్తీర్ణంలో ఆ విషాద స‌న్నివేశానికి గుర్తుగా స్మృతి వ‌న్ ను నిర్మించారు. ఇది త‌న అదృష్టంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీజీ(PM Modi).

భుజ్ భూకంపం స‌మ‌యంలో ప్రాణాలు కోల్పోయిన కోచ్ ప్ర‌జ‌ల అద్భుత‌మైన పోరాట స్పూర్తికి స్మృతి వాన్ నివాళి అని పేర్కొన్నారు. గుజ‌రాత్ లోని క‌చ్ ప్రాంతంలో 2001 లో సంభ‌వించిన వినాశ‌క‌ర‌మైన భూకంపం దేశాన్ని క‌దిలించి వేసింది.

ప్ర‌పంచాన్ని కంట‌త‌డి పెట్టారు. ప్ర‌జ‌లు చూపిన దృఢ‌త్వాన్ని గుర్తు చేసే స్మీతి వాన్ మెమోరియ‌ల్ ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు.

అంత‌కు ముందు గుజ‌రాత్ రాష్ట్రంలో ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. అనంత‌రం త‌న త‌ల్లి బెన్ ను క‌లుసుకున్నారు. ఆమె పాదాల‌ను తాకి ఆశీర్వాదాన్ని పొందారు.

ఈ ఏడాది జూన్ నెల‌లో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి నిజ‌మైన నివాళి అర్పించేందుకు స్మార‌క చిహ్నం నిర్మించ‌డం త‌న‌కు గ‌ర్వ కార‌ణంగా ఉంద‌ని ప్ర‌శంసించారు.

ఇందులో విశేషం ఏమిటంటే ఈ భారీ భూకంపం ఘ‌ట‌న‌లో 13 వేల మంది పేర్ల‌ను కూడా చేర్చారు. అంతే కాకుండా ఇందులో అత్యాధునిక స్మృతి వాన్ మ్యూజియం కూడా ఉంది.

ఈ స‌మ‌యంలో తాను స్మృతి వాన్ ను ప్రారంభించ‌డాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తు చేసుకున్నారు ప్ర‌ధాన మంత్రి మోదీ.

Also Read : వాడుకుని వ‌దిలేస్తే ఎలా – గ‌డ్క‌రీ

Leave A Reply

Your Email Id will not be published!