PM Modi Pongal : సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
తన చేతుల మీదగా పొంగల్ తయారు చేసిన ప్రధాని
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదానికి ప్రతిబింబమే సంక్రాంతి పండుగ. ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ(PM Modi) సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, సినీ నటి మీనా తదితరులు పాల్గొన్నారు. పొంగల్‌ను తన చేతులతో తయారు చేసి ప్రధాని మోదీ ప్రత్యేకతను చాటుకున్నారు. పొంగల్ సందర్భంగా కొత్త పంటలు లభిస్తాయని, దేవతలకు నైవేద్యంగా సమర్పించి భక్తిని చాటుకుంటారని చెబుతారు. దీని వెనుక అన్న దాతలకు దేశంలో ఇచ్చే గౌరవానికి ప్రతీకగా పేర్కొన్నారు.
PM Modi Participated in Pongal Celebrations
ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు మరియు శాంతిని కలిగించాలని కోరుకున్నారు. అంతేకాకుండా సంక్రాంతి ముగ్గుల పండుగ కావడంతో ప్రతి ఒక్కరు తమ ఇంటి లోగలను రకరకాల రంగులతో అలంకరించుకునేందుకు ఆసక్తి చూపుతారు. కారణం ఏమిటంటే దేశంలోని వివిధ రాష్ట్రాలను త్రిభుజం చుక్కల్లా కలుపుకుంటే దేశం కొత్త బలం పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమిళనాడులో ఈ పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంది, ఇక్కడ రైతులు చిన్న-రకం ధాన్యాలు పండించడంలో వారి ప్రతిభకు ప్రసిద్ధి చెందారు. కాశీ- తమిళ్, సౌరాష్ట్ర తమిళ్ అనే కాన్సెప్ట్ ఈ సంక్రాంతికి కనిపిస్తుందన్నారు.
Also Read : Piyush Goyal : చక్కెర ,గోధుమల ఎగుమతులపై కేంద్రం అభ్యంతరం