PM Modi Shivaji : దేశానికి స్పూర్తి ఛత్రపతి శివాజీ – మోదీ
జయంతి సందర్భంగా ప్రధాని నివాళి
PM Modi Shivaji : భారత దేశానికి కావాల్సినంత స్పూర్తిని, ధైర్యాన్ని ఇచ్చిన ఏకైక నాయకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ అని కొనియాడారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఫిబ్రవరి 19 శివాజీ జయంతి. ఆయనకు నివాళులు అర్పించారు.
ఆదివారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి. తాను జీవితంలో ఎందరినో స్పూర్తిగా తీసుకున్నారని అందులో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఒకరని పేర్కొన్నారు మోదీ(PM Modi Shivaji). 1630లో పుట్టిన శివాజీ శౌర్యం, పట్టుదలకు, నాయకత్వానికి మారు పేరుగా నిలిచారని కొనియాడారు. మరాఠా సామ్రాజాన్ని స్థాపించిన నాయకుడు శివాజీ. సుపరిపాలనపై ఉన్న ప్రాధాన్యత మనందరికీ స్పూర్తి కలిగిస్తుందని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
ఇదిలా ఉండగా ఛత్రపతి శివాజీ మహరాజ్ యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా భారత దేశపు రాజులలో అగ్ర గణ్యుడిగా గుర్తింపు పొందారు. మంత్రి మండలి, విదేశాంగ వధానం, పటిష్టమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ప్రజల సంక్షేమమే ప్రభువు (రాజు) అని నిరూపించిన గొప్ప రాజు ఛత్రపతి శివాజీ మహరాజ్. వ్యక్తిగత విలాసాలకు ఏనాడూ ఖర్చు చేయలేదు. కేవలం జీవించినంత కాలం ప్రజల సంక్షేమం కోసం పాటు పడ్డాడు.
తన పాలనా కాలంలో లెక్కలేనన్ని యుద్దాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్దంలో ఓడి పోయిన రాజ్యంలో ఉన్న వారికి , స్త్రీలకు, పసిపిల్లలకు సాయం చేశాడు ఛత్రపతి శివాజీ మహరాజ్. ముస్లిం రాజును ఓడించడంతో శివాజీ ముందు అందమైన కోడలును ముందుంచాడు. ఈ సందర్భంగా శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకోదగినవి. నా తల్లి కూడా మీ అంత అందమైనది అయి ఉంటే నేను కూడా అందంగా ఉండే వాడినంటూ ప్రకటించాడు.
Also Read : ఆధునిక కాలానికి ఆది యోగి