PM Modi Praise : చరిత్రాత్మక విజయం మోదీ సంతోషం
ఆసియా గేమ్స్ లో భారత్ అద్భుతం
PM Modi Praise : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా పీఎం స్పందించారు. ఆసియా గేమ్స్ 2023లో భారత క్రీడాకారుల బృందం చరిత్ర సృష్టించారు. గత 60 ఏళ్ల భారతీయ క్రీడా చరిత్రలో అరుదైన ఘనత సాధించారు క్రీడాకారులు. గతంలో భారత్ సాధించిన రికార్డును అధిగించారు తాజాగా జరిగిన క్రీడల్లో.
PM Modi Praise to Indian Sports Players
ఇప్పటి దాకా భారత్ ఏకంగా 107 పతకాలను సాధించింది. ఇది యావత్ భారత దేశానికి గర్వ కారణంగా నిలిచిందని , మీ కృషి, పట్టుదల, సమిష్టి నాయకత్వం తనను ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi ). దేశానికి చెందిన ప్రతి ఒక్క క్రీడాకారుడిని తాను పేరు పేరునా అభినందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
క్రీడాకారుల అచంచలమైన సంకల్పం, స్పూర్తి దాయకమైన పోరాట పటిమ తనను ఎంతగానో ఆశ్యర్య పోయేలా చేశారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. మిమ్మల్ని చూసి దేశం గర్వ పడుతోందని పేర్కొన్నారు. ప్రత్యేకించి భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లను సైతం అభినందనలతో ముంచెత్తారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం బీసీసీఐ ఆధ్వర్యంలో భారత్ లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ అంతర్జాతీయ టోర్నీలో టీమిండియా సత్తా చాటాలని కోరారు ప్రధాన మంత్రి.
Also Read : BCCI Failure : బీసీసీఐ తీరుపై సర్వత్రా ఆగ్రహం