Modi & Mithali Raj : మిథాలీ రాజ్ లివింగ్ లెజెండ్ – మోదీ

హైదరాబాదీ స్టార్ కు ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంస‌

Modi & Mithali Raj : భార‌త క్రికెట్ జ‌ట్టులోనే కాదు యావ‌త్ భార‌తావ‌నికి ఇటీవ‌లే క్రికెట్ రంగం నుంచి నిష్క్ర‌మించిన మిథాలీరాజ్(Mithali Raj) స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తార‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(Modi & Mithali Raj).

మ‌న్ కీ బాత్ సంద‌ర్భంగా మిథాలీరాజ్ సాధించిన విజ‌యాల‌ను గుర్తు చేశారు. ఏ రంగం లోనైనా స‌రే రాణించాలంటే ముందు క‌ష్ట‌ప‌డ‌టం నేర్చు కోవాల‌న్నారు.

తాను సాధార‌ణ చాయ్ వాలా నుంచి జీవితం ప్రారంభించాన‌ని, త‌ర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్ర‌ధాని వ‌ర‌కు చేరుకున్నాన‌ని చెప్పారు.

ఈ త‌రుణంలో ఒక సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన మిథాలీరాజ్ ఎవ‌రూ సాధించ‌లేని విజ‌యాల‌ను న‌మోదు చేసింద‌ని కితాబు ఇచ్చారు.

ఇలాంటి వాళ్లే దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలుస్తార‌ని పేర్కొన్నారు. భార‌త క్రికెట్ లో పురుషులే డామినేట్ చేస్తున్న త‌రుణంలో మిథాలీ రాజ్ ఓ ధృవ‌తార లాగా వెలుగొందార‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి.

ఎవ‌రి స‌హాయం లేకుండానే ఆడాల‌న్న సంక‌ల్పం, విజేత‌గా నిల‌వాల‌న్న క‌సి ఆమెను భార‌త క్రికెట్ రంగంలోనే కాదు ప్ర‌పంచ మ‌హిళా క్రికెట్ రంగంలో టాప్ లో ఉండేలా చేసింద‌న్నారు.

క్రికెట్ ఒక్క‌టే కాదు అన్ని క్రీడా రంగాల‌లో రావాల‌ని అనుకునే వారు, ప్ర‌స్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వారు, భార‌త్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వాళ్లు మిథాలీ రాజ్ ను చూసి నేర్చుకోవాల‌ని సూచించారు.

ఆమెను చూసి తాను గ‌ర్వ ప‌డుతున్నాన‌ని , భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సేవ‌లు అందించాల‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు మోదీ.

Also Read : యావ‌త్ ప్ర‌పంచం భార‌త్ వైపు చూస్తోంది -మోదీ

Leave A Reply

Your Email Id will not be published!