PM Modi : వికసిత్ భారత్ లక్ష్యాన్ని రాష్ట్రపతి ప్రసంగం ప్రతిబింబించింది
పేదల గురించి ఉత్తుత్తి హామీలు తాము ఇవ్వమని, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు...
PM Modi : రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి పధ్నాలుగు సార్లు సమాధానం ఇచ్చే అదృష్ట్యాన్ని దేశ ప్రజలు తనకు ఇచ్చారని, ఇందుకు తాను ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. పార్లమెంటు బడ్జె్ట్ సమావేశాల్లో రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి లోక్‌సభలో ప్రధాని సమాధానమిస్తూ, రాష్ట్రపతి ప్రసంగం ‘వికసిత్ భారత్’ లక్ష్యంపై దేశ దృఢసంకల్పనాన్ని పునరుద్ఘాటించిందని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందని, మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలని చెప్పారు.
PM Modi Praises…
”మనం 2025లో ఉన్నాం. ఒకరకంగా 21వ శాతాబ్దంలో 25 శాతం ముగిసిపోయింది. 20వ శతాబ్దంలో స్వాతంత్ర్యం తరువాత, 21వ శతాబ్దంలో 25 ఏళ్లలో ఏం జరిగిందనేది కాలమే చెబుతుంది. రాష్ట్రపతి ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనిస్తే, రాబోయే 25 ఏళ్లలో, వికసిత్ భారత్ దిశగా ప్రజల్లో విశ్వాసం పాదుకొలపే దిశగా పనిచేయనున్నాం. వికసిత్ భారత్(Viksit Bharat) లక్ష్యాన్ని రాష్ట్రపతి ప్రసంగం ప్రతిబింబించింది. సరికొత్త ధీమాను కల్పిస్తూ, సామాన్య ప్రజానీకానికి స్ఫూర్తిగా నిలిచింది” అని మోదీ(PM Modi) అన్నారు.
‘గరీబీహటోవా’ నినాదంపై మాట్లాడుతూ. ప్రభుత్వం తప్పుడు హామీలు ఇవ్వదని, ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందిస్తుందని ప్రధాని అన్నారు. ఇంతవరకూ పేదలుకు 4 లక్షల గృహాలు ఇచ్చామని, గతంలో మహిళలు బహిర్భూమి సిస్టమ్ లేక అవస్థలు పడవారని, ఎవరైతే అన్ని సౌకర్యాలు ఉన్నారో వారికి ఇలాంటి అవసరాలు అర్థం కావని పరోక్షంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చురకలు వేశారు. పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని అన్నారు. గత ఐదు దశాబ్దాలుగా 25 లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు. అంకితభావంతో పథకాలు అమలు చేసినప్పుడే ఇలాంటి మార్పు సంభవమని అన్నారు. పేదల గురించి ఉత్తుత్తి హామీలు తాము ఇవ్వమని, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. పేదలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి సవాళ్లను అవగాహన చేసుకుని, వాటిని అధిగమించేలా చేసేందుకు కట్టుబడి ఉంటామని చెప్పారు.
ప్రధాని తన ప్రసంగంలో రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్‌గా ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పరోక్షను ప్రస్తావిస్తూ, పేదల గుడిసెల్లో ఫోటో సెషన్లతో సరదాగా గడిపేవారికి పార్లమెంటులో పేదల గురించి మాట్లాడుతూ చేసే ప్రసంగాలు బోర్‌గానే ఉంటాయని అన్నారు. కొందరు నాయకులు విలాసవంతమైన షవర్లు కోరుకుంటారని, తమ ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వడంపై దృష్టిసారిస్తుందని కేజ్రీవాల్ విలాసవంతమైన శీష్ మహల్ (అద్దాల మేడ)పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామలకు 16 పైసలే చేరుతోందని గతంలో ఒక ప్రధాని వాపోయారని, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అప్పట్లో అదే పరిస్థితి ఉండేదని ప్రధాని అన్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామానికి రూపాయి అందుతోందని, నగదు బదిలీతో నేరుగా ప్రజలకే సొమ్ము అందుతోందని వివరించారు.
Also Read : Minister Rajnath Singh Slams : జాతీయ ప్రయోజనాలపై రాహుల్ వ్యాఖ్యలు విచారకరం