BS Yediyurappa Modi : బీఎస్ యెడ్యూర‌ప్ప‌కు మోదీ గిఫ్ట్

మాజీ సీఎం పుట్టిన రోజు

BS Yediyurappa Birthday Modi : దక్షిణ భార‌త దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చిన ఏకైక నాయ‌కుడు , అప‌ర చాణ‌క్యుడిగా పేరొంద‌రు బీఎస్ యెడియూర‌ప్ప‌. ఆయ‌న నాలుగుసార్లు సీఎంగా ఎన్నిక‌య్యారు. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఫిబ్ర‌వ‌రి 27న ఆయ‌న పుట్టిన రోజు. ఆయ‌న జ‌న్మ‌దినోత్స‌వాన్ని(BS Yediyurappa Birthday Modi)  పుర‌స్క‌రించుకుని శివ‌మొగ్గ‌లో నూత‌నంగా నిర్మించిన ఎయిర్ పోర్టును ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.

అనంత‌రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో యెడియూర‌ప్ప‌కు అరుదైన బ‌హుమానం అంద‌జేశారు. తాను ఎంతగానో ఇష్ట‌ప‌డే నాగ‌లిని మాజీ సీఎంకు బ‌హూక‌రించారు. ఆయ‌న ప‌ట్ల త‌న‌కు ఉన్న ప్రేమ‌ను చాటుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఏడాది ఏప్రిల్ , మే నెల‌లో క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రోడ్ షో కూడా చేప‌ట్టారు మోదీ. ఆయ‌న వెంట ఉన్నారు యెడియూర‌ప్ప‌. బీజేపీలో ప్ర‌ముఖ నేత‌ల్లో ఒక‌డిగా ఉన్నారు.

అయితే ఇటీవ‌లే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పీఎం మోదీ మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చేలా తాను క‌ష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పారు. ఇక బీఎస్ యెడియూర‌ప్ప(BS Yediyurappa Birthday) ఫిబ్ర‌వ‌రి 27, 1943లో మాండ్యా జిల్లాలోని బూక‌నాకెర‌లో పుట్టారు. 1970లో ఆర్ఎస్ఎస్ సంఘ్ కార్య‌ద‌ర్శిగా ఉన్నార‌ను. 1972లో తాలూకా శాఖ‌కు జ‌న్ సంఘ్ కు అధ్య‌క్షుడిగా ఉన్న‌రు. 1975ల జైలుకు వెళ్లాడు. 1980లో బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడ‌లేదు యెడ్యూర‌ప్ప‌.

నాలుగుసార్లు క‌ర్ణాట‌క రాష్ట్రానికి సీఎంగా ఎన్నిక‌య్యారు. కానీ పూర్తికాలం ఉండ‌లేక పోయారు బీఎస్ యెడియూర‌ప్ప‌. ఎన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా త‌న చ‌రిష్మాతో నెట్టుకుంటూ వ‌చ్చారు.

Also Read : ఘ‌న స్వాగ‌తం మోదీపై పూల‌వ‌ర్షం

Leave A Reply

Your Email Id will not be published!