Swami Sivananda Modi : యావత్ భారతావని విస్తు పోయింది. కొద్ది సేపు ఆయనను చూసి. టెక్నాలజీ ఊపులో కొట్టుకుపోతున్న భారత దేశంలో 125 ఏళ్లుగా జీవిస్తున్న ఓ యోగి గురు గురించి తెలుసుకుని ఆశ్చర్యానికి లోనైంది.
ఆయన ఎవరో కాదు యోగా గురువుగా ప్రసిద్ది పొందిన స్వామి శివానంద(Swami Sivananda Modi ).
కేంద్ర ప్రభుత్వం ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.
దేశ రాజధానిలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. పురస్కారం అందుకునే ముందు స్వామి శివానంద
ఎవరి సాయం లేకుండానే తానే ఒంటరిగా నడుచుకుంటూ వచ్చారు. ప్రధాని మోదీకి , రాష్ట్రపతికి ప్రణమిల్లారు.
దీంతో మోదీ స్వామి శివానందకు (Swami Sivananda Modi)ప్రణమిల్లారు. స్వామి శివానంద తన జీవితాన్ని మానవ హితం, సమాజ శ్రేయస్సు కోసం అంకితం చేశారు.
ఈ కాలంలో 50 ఏళ్లు బతకడమే కష్టం కానీ శివానంద గురూజీ ఏకంగా 125 ఏళ్లలో సైతం అందరితో పాటే నడుచుకుంటూ రావడం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేసింది.
రాష్ట్రపతి భవన్ లోని రాజభవన్ దర్బార్ హాలులో చెప్పులు లేకుండా నడిచి వచ్చారు.
పద్మశ్రీని అందుకుంటగా అంతా లేచి హర్షధ్వానాలు పలికారు. తెల్లటి కుర్తా, పైజామా ధరించి వచ్చారు శివానంద.
భారతీయతను ఆపాదించుకున్న ఈ గురూజీని చూసి సంతోషానికి లోనయ్యారు మోదీజీ.
స్వామి శివానంద ఉదయాన్నే యోగా చేస్తారు. నూనె లేని వండిన ఆహారం తీసుకుంటారు.
తనకు తోచిన రీతిలో సేవ చేస్తుంటారు. క్రమశిక్షణతో కూడిన జీవితం ఆయనను ఇంత దాకా తీసుకు వచ్చేలా చేసింది.
అతని సరళమైన మార్గాలు వ్యాధి లేని , ఒత్తిడి లేని సుదీర్గ జీవితాన్ని అందించాయి.
స్వామి శివానంద తన జీవితాన్ని బోధించడం కంటే ఆదర్శ ప్రాయమైన పాఠంగా మిగిలారు.
ఆరేళ్ల వయసులో తన పేరెంట్స్ ను కోల్పోయారు. పశ్చిబ బెంగాల్ లోని నబద్వీప్ లోని గురూజీ ఆశ్రమానికి చేర్చారు.
గురు ఓంకారానంద గోస్వామి ఆయనకు విద్యను అందించారు. పాఠశాల విద్య లేకుండా యోగాతో సహా అన్ని ఆచరణాత్మక ,
ఆధ్యాత్మిక విద్యను అందించారు. తన జీవితమంతా సానుకూల ఆలోచనలతో ఉన్నారు.
ప్రపంచమే తన ఇల్లుగా భావించారు. ప్రజలే తండ్రులు. వారిని ప్రేమించడం. సేవ చేయడం నా ధర్మం అని చెబుతారు.
గత 50 ఏళ్లుగా స్వామి శివానంద పూరీలోని కుష్టు వ్యాధితో బాధ పడుతున్న 600 మంది యాచకులకు సేవలందించారు.
గౌరవ ప్రదంగా జీవించేలా చేశారు. ఆయనకు ఎన్నో అవార్డులు దక్కాయి. స్వామి శివానంద ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కదూ.
Also Read : సినీవాలిలో వివేక్ వెరీ స్పెషల్