PM Modi : చరిత్ర విస్మ‌రించిన చిహ్నాల‌ను స్మ‌రిస్తున్నాం

జాతిని ఉద్దేశించి దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

PM Modi : 75వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి జాతిపిత మ‌హాత్మా గాంధీకి రాజ్ ఘ‌ట్ వ‌ద్ద నివాళులు అర్పించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

చ‌రిత్ర విస్మ‌రించిన స్వాతంత్ర చిహ్నాల‌ను భారత‌దేశం నేడు గౌర‌విస్తోంద‌ని అన్నారు. ఎర్ర‌కోట‌పై స‌మున్న‌త భార‌తావ‌నికి ప్ర‌తీక‌గా నిలిచే జాతీయ ప‌తాకాన్ని న‌రేంద్ర మోదీ(PM Modi) ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్బంగా గ‌తంలో చ‌రిత్ర కొంత మందిని మాత్ర‌మే గుర్తించింద‌ని కానీ తాము పాల‌నలోకి వ‌చ్చాక మిగ‌తా వారిని కూడా వెలుగులోకి తీసుకు వ‌చ్చామ‌ని చెప్పారు ప్ర‌ధాన మంత్రి.

ఇదిలా ఉండ‌గా ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా దేశ రాజధాని అంత‌టా భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. 10,000 మందికి పైగా సిబ్బందిని ఎర్ర‌కోట వ‌ద్ద కాప‌లాగా ఉంచారు.

ఈ ప్ర‌త్యేక స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మీకు శుభాకాంక్ష‌లు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు. అంత‌కు ముందు మోదీ పోలీస్ గార్డ్ ఆఫ్ ఆన‌ర్ ను స్వీక‌రించారు.

మొట్ట మొద‌టిసారిగా 21 గ‌న్ సెల్యూట్ వేడుక‌లో దేశీయంగా త‌యారు చేసిన హోవిట్ట‌ర్ తుపాకులు ఉప‌యోగించారు. డీఆర్డీఓ అభివృద్ది చేసిన దానిని ప్ర‌ద‌ర్శించారు.

14 వేర్వేరు దేవాల నుండి 26 మంది అదికారులు, ప‌ర్య‌వేక్ష‌కులు , 127 మంది క్యాడెట్లు, యువ‌కులు వేడుక‌ల్లో పాల్గొంటున్నారు.

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. యావ‌త్ ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు భార‌త దేశం వైపు చూస్తోంద‌ని చెప్పారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

ఇందులో భాగంగానే భారత దేశానికి ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక‌గా నిలిచిన జాతీయ జెండాను ప్ర‌తి ఇంటిపై ఎగుర వేసే కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేశామ‌న్నారు.

Also Read : 25 ఏళ్ల‌లో ప్రపంచంలో భార‌త్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!