PM Modi : ఎలా గెలవాలో చెస్ నేర్పుతుంది – మోదీ
అందుకే ఆ ఆటకు అంత ఆదరణ
PM Modi : భారత దేశంలో ఎన్నో ఆటలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నాయి. అందులో చదరంగం ఒకటి. అనాది కాలం నుంచి వస్తున్నదే. ఇప్పుడు ఈ చెస్ వరల్డ్ వైడ్ గా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల దాకా ఈ ఆటపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తనకు కూడా చెస్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi).
ఇదిలా ఉండగా ఆదివారం భారత దేశంలో ప్రారంభం కానున్న చెస్ ఒలింపియాడ్ కు మొదటి టార్చ్ రిలే కావడం విశేషం. కాగా మన దేశం ఒలింపియాడ్ కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
భారత్ లో ఆవిష్కృతమైన చెస్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తున్నందుకు ఆనందంగా ఉందని, అంతకు మించి తనకు గర్వంగా ఉందన్నారు ప్రధానమంత్రి.
న్యూఢిల్లీ లోని ఇందిరాగాంధీ స్టేడియంలో 44వ చెసస్ ఒలింపియాడ్ కోసం టార్చ్ రిలేను ప్రాంరభించారు మోదీ(PM Modi). ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
కాగా చెన్నై సమీపంలోని మహాబలిపురం వద్ద ముగింపు జరుగుతుంది. 40 రోజుల్లో శ్రీనగర్ , జైపూర్ , సూరత్, ముంబై, భోపాల్ , పాట్నా, కోల్ కతా, గ్యాంగ్ టక్ సహా 75 నగరాలకు ఈ చెస్ రిలే కు సంబంధించిన జ్యోతిని తీసుకు వెళ్లనున్నారు.
ప్రతి ప్రదేశంలో, రాష్ట్రంలోని చెస్ గ్రాండ్ మాస్టర్ లు జ్యోతిని అందుకుంటారు. చదరంగం చాలా దేశాలకు అభిరుచిగా మారడం సంతోషంగా ఉందన్నారు.
ఇదే సమయంలో చెస్ ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మన భారత దేశం కావడం మరింత ఆనందం కలుగుతోందన్నారు.
Also Read : ‘అగ్నివీర్స్’ రిక్రూట్‌మెంట్ షెడ్యూల్ డిక్లేర్