PM Modi KCR : మోదీ వార్నింగ్ దేనికి సంకేతం
ఇంకా స్పందించని టీఆర్ఎస్
PM Modi KCR : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ప్రధానమంత్రి మోదీ రెండు రోజుల పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీలో సీఎం జగన్ పాల్గొంటే తెలంగాణలో సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు.
ఈ తరుణంలో రామగుండంలో పర్యటించిన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఊహించని రీతిలో ఈసారి ప్రధానమంత్రి స్వరం మారింది. ఆయన తన గొంతును మరింత పెంచారు. కొంత మెతక వైఖరిని అవలంభిస్తూ వచ్చిన మోదీ(PM Modi KCR) ఉన్నట్టుండి దూకుడు పెంచారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.
కుటుంబ, అవినీతి పాలన అంతం చేయడమే తమ ముందున్న టార్గెట్ అంటూ ప్రకటించారు. అంతే కాదు కొందరికి హైదరాబాద్ లో నిద్ర పట్టదన్నారు. అంటే మెల మెల్లగా కేసీఆర్ కు చెక్ పెట్టనున్నారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. తనపై, పార్టీపై అవాకులు చెవాకులు పేలుతూ వస్తున్న టీఆర్ఎస్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కానీ ఎక్కడా సీఎం పేరును ప్రస్తావించ లేదు ప్రధానమంత్రి. ప్రజలే చరిత్ర నిర్మాతలని కుటుంబం కాదన్నానరు నరేంద్ర మోదీ. తనను ఎన్నిసార్లు తిట్టినా ఏమీ అనుకోనని పేర్కొన్నారు. మూఢ నమ్మకాలతో టీఆర్ఎస్ చీకటి పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి అనకొండలా పేరుకు పోయిందని ఎద్దేవా చేశారు.
కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయి పోయిందంటూ మండిపడ్డారు నరేంద్ర మోదీ. విచిత్రం ఏమిటంటే కేంద్రంలో పవర్ లో ఉన్న ప్రధానమంత్రి కేసీఆర్ ను, ఫ్యామిలీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు జనం.
Also Read : తెలంగాణలో అవినీతి..కుటంబ పాలన – మోదీ