PM Modi : అంతరిక్షంలోకి వెళ్లే ఆ నలుగురి పేర్లను రివీల్ చేసిన ప్రధాని

గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశారు

PM Modi : కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. మూడు రాష్ట్రాల్లో రూ.24,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. తిరువనంతపురం సమీపంలోని తుంబాలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, రూ. 1,800 కోట్ల విలువైన మూడు ప్రధాన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి భార‌త‌దేశం యొక్క మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ పురోగతిని సమీక్షించనున్నారు.

PM Modi Reveals

గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’లో శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. వీటిలో గ్రూప్ కెప్టెన్ పి.బాలకృష్ణన్ నెహ్రూ, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ ఎస్.శుక్లా పేర్లు ఉన్నాయని ప్రధాని(PM Modi) చెప్పారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గగన్‌యాన్ మిషన్‌లోని నలుగురు వ్యోమగాముల దుస్తులకు బ్యాడ్జిలను తొడిగి అభినందించారు.

ఈ నలుగురు వ్యోమగాములు భారత వైమానిక దళం యొక్క టెస్ట్ పైలట్లు. అయితే స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయులుగా వీరంతా రికార్డును అందుకోనున్నారు. ఇంతకుముందు, అంతరిక్షంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి వ్యోమగామిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించాడు. అయితే, రష్యా ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన నౌకలో అతను ఈ ఘనతను సాధించాడు.

Also Read : IT Minister Sridharbabu : కొత్త పారిశ్రామిక వేత్తలకు కూడా అన్ని విధాలా సహకరిస్తాం

Leave A Reply

Your Email Id will not be published!