PM Narendra Modi : కాంగ్రెస్ ద్వేషపూరిత రాజకీయాలతో ప్రజలను మోసం చేసింది

భవిష్యత్తు పనుల కోసం మనందరికీ మార్గదర్శకంగా ఉందన్నారు...

Narendra Modi : సమాజంలో కాంగ్రెస్ కులమత ద్వేశాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్రమంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చించిన క్రమంలో పేర్కొన్నారు. మా విధానాలలో “నేషన్ ఫస్ట్” అనే స్ఫూర్తిని పరిగణించామని పేర్కొన్నారు. 2014 తర్వాత దేశం ఒక కొత్త నమూనాను చూసిందని చెప్పారు. కాంగ్రెస్(Congress) స్వార్థపూరిత రాజకీయాలు అందరినీ మోసం చేశాయని మోదీ(Narendra Modi) వ్యాఖ్యానించారు.

Narendra Modi Slams Congress

మేము బాబా సాహెబ్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లి పేదలకు సహాయం చేశామని మోదీ(Narendra Modi) అన్నారు. కాంగ్రెస్ దానిని గతంలో తీవ్రమైన సంక్షోభంగా మార్చిందని గుర్తు చేశారు. 2014లో మా ప్రభుత్వం ఈ ఆలోచనను పూర్తిగా మార్చేసింది. నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధికి మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ఆ క్రమంలో మొదటిసారి వ్యాపారంలోకి వస్తున్న వారికి ముద్ర పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండా రుణం ఇస్తున్నట్లు వెల్లడించారు.

మనం చరిత్రను పరిశీలిస్తే కాంగ్రెస్ బాబా సాహెబ్ అంబేద్కర్‌ను ద్వేషించిందని, ఆయనపై ఎంత కోపంగా ఉందో మనకు తెలుస్తుందన్నారు మోదీ(Narendra Modi). బాబా సాహెబ్‌ను భారతరత్నకు ఎప్పుడూ అర్హులుగా పరిగణించలేదన్నారు. కానీ ప్రస్తుతం ఈ దేశ ప్రజలు బాబా సాహెబ్ భావాలను గౌరవించారు. ఈ సమయంలో కాంగ్రెస్ తప్పక జై భీమ్ అనాల్సి వస్తుందన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా, భవిష్యత్తు పనుల కోసం మనందరికీ మార్గదర్శకంగా ఉందన్నారు.

దేశానికి తొలి ప్రభుత్వ సమయంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ క్రమంలో ముంబైలో కార్మికుల సమ్మె జరిగింది. అందులో ప్రముఖ గీత రచయిత మజ్రూహ్ సుల్తాన్‌పురి బానిస అనే పాటను పాడారు. దీనికి గాను నెహ్రూ జీ అయనను జైల్లో పెట్టారు. ఆ క్రమంలో ప్రముఖ నటుడు బలరాజ్ సాహ్ని ఊరేగింపులో పాల్గొన్నారు. ఆయనను కూడా జైల్లో పెట్టారు. లతాజీ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఆల్ ఇండియా రేడియోలో వీర్ సావర్కర్ పై ఒక కవిత పఠించాలని అనుకున్నారు. దీని కారణంగా అయనను ఆకాశవాణి నుంచి బహిష్కరించారు.

వీరి సమయంలో దేశం అత్యవసర పరిస్థితిని కూడా చూసిందన్నారు మోదీ. రాజ్యాంగాన్ని ఎలా తుడిచిపెట్టారో గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కారు. ఇదంతా వారి అధికారం, ఆనందం కోసమే జరిగింది. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రముఖ కళాకారుడు దేవ్ ఆనంద్‌ని అత్యవసర పరిస్థితికి మద్దతు ఇవ్వమని కోరారు. దేవ్ ఆనంద్ నిరాకరించారు. దీంతో దూరదర్శన్‌లో దేవ్ ఆనంద్ సినిమాలు నిషేధించబడ్డాయి. ఆ తర్వాత కిషోర్ కుమార్ కాంగ్రెస్ తరపున పాడటానికి నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా రేడియోలో కిషోర్ పాటలను నిషేధించింది.

Also Read : Minister S Jaishankar : అక్రమ వలసదారులను తిరిగి పంపడం పై స్పందించిన విదేశాంగ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!