PM Narendra Modi: తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని నరేంద్ర మోదీ
తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం - ప్రధాని నరేంద్ర మోదీ
PM Narendra Modi: తెలంగాణా అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సోమవారం రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ఆదిలాబాద్ నుండి సుమారు రూ.7వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ(PM Narendra Modi) మాట్లాడుతూ… ‘‘ఇది ఎన్నికల సభ కాదు.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదు. మీరందరూ వికసిత్ భారత్ కోసం ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. 15 రోజుల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 15 రోజుల్లో రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్‌ను ప్రారంభించాం. దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధి పధంలో దూసుకెళ్తున్నాయి. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారు, ’’ అని మోదీ అన్నారు.
PM Narendra Modi – కేంద్రంతో ఘర్షణ వైఖరి… రాష్ట్రాభివృద్ధికి ఆటంకం: సీఎం రేవంత్
కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. ఎన్టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. మావైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలి. ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్నలాంటివారు. రాష్ట్రానికి పెద్దన్నలా మోదీ సహకారం అందించాలని… సీఎం రేవంత్ కోరారు.
Also Read : CM Revanth Reddy : కేంద్రంతో వైరుధ్యం అభివృద్ధికి ఆటంకం – సీఎం రేవంత్