PM Narendra Modi: ‘రామమందిరం’ పోస్టల్‌ స్టాంప్‌లు విడుదల చేసిన ప్రధాని మోదీ !

‘రామమందిరం’ పోస్టల్‌ స్టాంప్‌లు విడుదల చేసిన ప్రధాని మోదీ !

PM Narendra Modi: యావత్ ప్రపంచం ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం అయోధ్య రామమందిరం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. రామ మందిరం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం సమీపిస్తుండటంతో ఏర్పాట్లు ముమ్మరం చేసింది రామ మందిర ట్రస్ట్. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ(PM Narendra Modi) గురువారం ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌లను విడుదల చేశారు. రామమందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్‌ రాజ్‌, శబరి మాతపై మొత్తం ఆరు స్టాంప్‌లను ప్రధాని విడుదల చేశారు. అయోధ్య ఆలయ ఆకృతి, మందిరం ఆవరణలోని కళాఖండాలు, సూర్యభగవానుడు, సరయూ నది ప్రతిబింబించేలా ఈ పోస్టల్ స్టాంపులను డిజైన్‌ చేశారు. అంతేకాదు ‘మంగళ్‌ భవన్‌ అమంగళ్‌ హరి’ అనే కవిత్వాన్ని కూడా స్టాంపుపై ముద్రించారు.

PM Narendra Modi Open

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి స్మారకంగా భారత తపాలా శాఖ రూపొందించిన పోస్టల్ స్టాంపులతో పాటు శ్రీరాముడిపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందించిన పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 48 పేజీల ఈ స్టాంపుల పుస్తకంలో 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంప్‌ లను పొందుపర్చారు. అమెరికా, న్యూజిలాండ్‌, సింగపూర్‌, కెనడా, కాంబోడియా దేశాలు సహా ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు శ్రీరాముడిపై విడుదల చేసిన స్మారక స్టాంపులు ఆ పుస్తకంలో ఉన్నాయి.

Also Read : TDP Vs YSRCP War : ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతికి గుడివాడలో టీడీపీ వెర్సెస్ వైసీపీ నువ్వా.. నేనా అంటూ సభలు

Leave A Reply

Your Email Id will not be published!