#Corona : క‌రోనా చ‌దువుల‌పై క‌విత‌ల పోటీ

Poetry competition on corona - Education

Corona : గ‌డ‌చిన 27 ఏండ్లుగా వివిధ సంద‌ర్భాల‌కు అనుగుణంగా సామాజిక‌, సాంస్కృతిక‌, విజ్ఞాన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావ‌రిఖ‌ని లోని వ‌సుంధ‌ర విజ్ఞాన వికాస మండ‌లి గ‌త గ‌త ఏడాది క‌రో్నా కార‌ణంగా ఎలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేక‌పోయింది.

అయితే ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా రాష్ట్ర‌స్థాయి పాఠ‌శాల‌ల విద్యార్థుల‌ను ప్రోత్స‌హించేందుకు రాష్ట్ర స్థాయి క‌విత‌ల పోటీలను నిర్వ‌హిస్తున్నట్టు సంస్ధ అధ్య‌క్షులు చ‌దువు వెంక‌ట‌రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విద్యార్ధులు లాక్‌డౌన్ కార‌ణంగా చాలా ఇబ్బందుల‌ను ప‌డ్డార‌ని స‌రిగ్గా ఈ విష‌యంపైనే ప‌ద‌వ‌త‌ర‌గ‌తి లోపు విద్యార్థుల నుంచి క‌విత‌లు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. క‌రోనాచ‌దువులు) అనే అంశం మీదా . విద్యార్ధులు త‌మ క‌విత‌ల‌ను ఫిబ్ర‌వ‌రి 20 లోగా క్రింది చిరునామాకు పంపాలి ఇలా వ‌చ్చిన క‌విత‌ల్లో ఐదు ఉత్త‌మ క‌విత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేస్తామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

క‌విత‌లు పంపాల్సిన చిరునామా
వ‌సుంధ‌ర విజ్ఞాన వికాస మండ‌లి, క్వార్ట‌ర్‌నెం- టీటూ-881, తిల‌క్‌న‌గ‌ర్‌, గోదావ‌రిఖ‌ని-505209, పెద్ద‌ప‌ల్లి జిల్లా. సంప్ర‌దించాల్సిన పోన్‌నెంబ‌ర్లు- 9182777409, 9492463462,9849950188

No comment allowed please