Raghunandan Rao : బీజేపీ ఎమ్మెల్యేకు షాక్ కేసు నమోదు
బాలిక గ్యాంగ్ రేప్ కేసు వ్యవహారం
Raghunandan Rao : భారతీయ జనతా పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనపై హైదరాబాద్ లోని ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ వ్యవహారానికి సంబంధించి ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు తన పార్టీ ఆఫీసులో బట్టబయలు చేశారు.
ఇది చట్టానికి విరుద్దమని పేర్కొంటూ పోలీసులు ఐపీసీ సెక్షన్ 228ఏ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.
ఇదిలా ఉండగా బాలికకు సంబంధించిన వీడియోలను వెల్లడించడంలో కీలక పాత్ర పోషించినట్లుగా భావిస్తున్న నగరంలోని పాతబస్తీకి చెందిన సుభాన్ అనే వెబ్ పోర్టల్ రిపోర్టర్ కు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కాగా అత్యాచారానికి గురైన బాధితురాలి గురించి, ప్రత్యేకంగా మైనర్ బాలిక, యువతికి సంబంధించిన వివరాలు బయటకు వెల్లడించ కూడదని ఇప్పటికే భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర్వులు కూడా వెల్లడించింది. దీనిని ఆధారంగా చేసుకుని వెస్ట్ జోన్ డీసీపీ స్పష్టం చేశారు. తాము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను ఆధారంగా చేసుకునే వివరాలు వెల్లడించడం లేదని తెలిపారు.
కాగా కేసుకు సంబంధించి వీడియోలు ఎవరు తీశారు, ఎందుకు తీయాల్సి వచ్చింది. ఎలా బయటకు వచ్చాయనే విషయాలపై స్పష్టత వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు.
కాగా లైంగిక దాడి ఘటనకు సంబంధించి పేరెంట్స్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : ఏపీలో కాషాయ జెండా ఎగరాలి