MLA KTR : ఏసీబీ ఆఫీస్ వద్ద మాజీ మంత్రి వాహనాన్ని నిలిపివేసిన పోలీసులు
లాయర్‌తో విచారణకు వస్తే ఎందుకు భయపడుతున్నారు...
KTR : ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. లీగల్ టీంతో కేటీఆర్.. ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. అయితే ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. కేటీఆర్(KTR) వెంట న్యాయవాదులు వెళ్ళకూడదంటూ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీనిపై కేటీఆర్(KTR) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఏసీబీ కార్యాలయం బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదని.. దీని వల్ల సీఎం రేవంత్ రెడ్డి సాధించేది ఏమీ లేదని అన్నారు. ‘‘ ఈరోజు మామయ్య రెండో సంవత్సరీకం. నన్ను ఇక్కడ విచారణకు కూర్చోబెట్టి నా ఇంట్లో దాడులు చేసేందుకు ప్రణాళికలు చేశారు.కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున విచారణకు రావాల్సిన అవసరం లేదు. కానీ నేను చట్టానికి గౌరవించే పౌరుడిగా ఏసీబీ విచారణకు వచ్చాను. కోర్టులో విచారణ తర్వాత వస్తానని చెప్పి తప్పించుకోవచ్చు. కానీ తప్పించుకోను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. నిజాయితీగా ఉన్నాను కాబట్టే ధైర్యంగా వచ్చాను’’ అని కేటీఆర్ అన్నారు.
MLA KTR Comments
‘‘లాయర్‌తో విచారణకు వస్తే ఎందుకు భయపడుతున్నారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో కుట్ర చేశారు.రేవంత్ డైరెక్షన్‌లో ఆయన ఇవ్వని స్టేట్‌మెంట్‌ను ఇచ్చినట్లుగా నా పేరును చెప్పి ఇరికించే ప్రయత్నం చేశారు.కాబట్టి నేను కూడా చెప్పని స్టేట్‌మెంట్‌ను చెప్పినట్టుగా చేస్తారని భావించే న్యాయపరమైన మద్దతు ఉండాలనే లాయర్‌ను వెంటబెట్టుకుని వచ్చాను. లాయర్ ఉంటే భయమెందుకు. అర్ధగంటగా రోడ్డుపై నిలబెట్టారు. నేను రేవంత్‌ను నమ్మను. లాయర్‌తోనే విచారణకు వస్తా. లేనిపక్షంలో లిఖిత పూర్వకంగా ఇస్తాను. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే నాకు జరుగుతుంది అనే నమ్మకం నాకు ఉంది. అందుకే లాయర్‌తో సమక్షంలో విచారణ జరగాలని కోరుతున్నా. కొద్ది రోజులు అల్లు అర్జున్ డ్రామా.. ఆపై కేటీఆర్‌పై కేసు డ్రామా. ఏదో డ్రామా పెట్టి డైవర్షన్ చేసి టైంపాస్ చేయడమే వీరి ఉద్దేశం’’ అంటూ కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందుబంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసంలో కేటీఆర్‌తో మాజీ మంత్రులు సమావశమయ్యారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు.. కేటీఆర్‌తో భేటీ అయ్యారు. నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.భేటీ అనంతరం నందినగర్ నివాసం నుంచి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. మరోవైపు కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.ఏసీబీ కార్యాలయం నాలుగవైపులా భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏసీబీ కార్యాలయం ముందు ఆందోళన చేసే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.దాదాపు 500 మంది పోలీసులతో నాలుగు వైపులా బందోబస్తు పెట్టారు. టాస్క్ ఫోర్స్‌తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : Manda Krishna Madiga : చంద్రబాబు నాపై నమ్మకంతో పెద్ద పదవి…