Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ షాక్ పొంగులేటి బిగ్ షాక్
వైరా అభ్యర్థిని ప్రకటించిన శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. అన్ని పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ లో రోజు రోజుకు ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
నిన్నటి దాకా భారత రాష్ట్ర సమితిలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఉన్నట్టుండి తిరుగుబాటు స్వరం వినిపించారు. తాజాగా బీఆర్ఎస్ పొంగులేటికి చెందిన 20 మంది సీనియర్ నాయకులపై వేటు వేసింది. దీంతో ఇక శ్రీనివాస్ రెడ్డిని సాగనంపనుందని అర్థమై పోయింది.
తన అనుచరులపై వేటు వేయడంతో కోలుకోలేని షాక్ ఇచ్చారు మాజీ ఎంపీ. ఏకంగా వైరా అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించి విస్తు పోయేలా చేశారు. ఈ నియోజకవర్గంలో బానోత్ విజయ బాయి పోటీ చేస్తారని ప్రకటించారు.
అయితే ఏ పార్టీ నుంచి అని ప్రకటించ లేదు కానీ ఇండిపెండెంట్ గా నైనా బరిలో ఉంటామని గెలవడం ఖాయమన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన అనుచర వర్గమంతా స్వతంత్రులుగా పోటీలో ఉండనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లో మీడియాతో మాట్లాడారు మాజీ ఎంపీ.
తన పొలిటికల్ కెరీర్ లో వైరా నియోజకవర్గంతో ఎనలేని బంధం ఉందన్నారు. తనను ఈ నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆదరించారని స్పష్టం చేశారు. వామపక్షాలకు చెందిన సీనియర్ నాయకుడు ధర్మన్న కూతురు తమ వర్గంలోకి రావడం మరింత బలం చేకూర్చిందన్నారు.
ఇదిలా ఉండగా విజయ బాయి మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో(Ponguleti Srinivas Reddy) కలిసి పని చేసే అవకాశం సంతోషంగా ఉందన్నారు. ఒక రకంగా ఇది తనకు అదృష్టమేనని పేర్కొన్నారు విజయ బాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పలువురిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.
Also Read : అన్నీ అబద్దాలు జనం చెవుల్లో పూలు