Ponnala Lakshmaiah : బీసీల‌కు 50 శాతం టికెట్లు ఇవ్వాలి

మాజీ మంత్రి పొన్నాల కొత్త రాగం

Ponnala Lakshmaiah : హైద‌రాబాద్ – మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల ల‌క్ష్మ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్య‌ధిక శాతం బ‌హ‌జన వ‌ర్గాల‌కు చెందిన వారున్నార‌ని అన్నారు. కానీ ఆయా పార్టీలు వారిని గుర్తించ‌డం లేద‌న్నారు.

Ponnala Lakshmaiah Comment

మా కోటా మా వాటా కోసం తాను కూడా మాట్లాడుతున్నాన‌ని చెప్పారు. ఇదే విష‌యాన్ని పార్టీ హైక‌మాండ్ కు తెలియ చేసిన‌ట్లు తెలిపారు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌(Ponnala Lakshmaiah). బీసీల‌కు ప్ర‌స్తుతం 119 సీట్ల‌లో 50 శాతం టికెట్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

పార్టీకి సంబంధించి బీసీల‌కు ఇస్తేనే మ‌నుగ‌డ సాధిస్తుంద‌ని, త‌ద్వారా ప‌వ‌ర్ లోకి వ‌చ్చే ఛాన్స్ ఉంటుంద‌న్నారు మాజీ మంత్రి. ఓబీసీల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోతే పార్టీ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌న్నారు. పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

విచిత్రం ఏమిటంటే కేవ‌లం 34 సీట్లు ఇస్తామ‌ని అంటున్నార‌ని, ఇది ఎంత మాత్రం న్యాయం కాద‌న్నారు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌. పార్టీ ప‌రంగా బీసీల‌కు 57 సీట్లు ఇవ్వాల‌ని కోరుతున్న‌ట్లు చెప్పారు. కానీ కేవ‌లం 34 సీట్లు మాత్ర‌మే ఇస్తామ‌ని చెప్పార‌ని తెలిపారు. దీనిని ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేదంటున్నారు.

Also Read : Chandra Babu Naidu : బాబు పిటిష‌న్ పై జ‌డ్జి విముఖ‌త‌

Leave A Reply

Your Email Id will not be published!