Ponnavolu Sudhakar Reddy : తిరుమల లడ్డూ వివాదం లో నిజాలు నిగ్గు తేల్చాలి
విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా నిపుణుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు...
Ponnavolu : తిరుమల లడ్డూ వివాదంలో నిజాలు బయటకు రావాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. కోట్లాదిమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నానికి టీడీపీ ఒడగట్టిందని ఆరోపించారు. ఇది ఒక పార్టీ, ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదని. కోట్లాదిమంది భక్తుల విషయమని చెప్పారు. ఈ ప్రచారంలో నిజాలు నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో టీటీడీ(TTD) మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిల్ దాఖలు చేశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) గుర్తుచేశారు. తొలుత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అనుకున్నామని… కానీ ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించిన విషయం కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు. ఈ ప్రచారంలో నిజం ఉంటే అది బయటకు రావాలని అన్నారు. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో నిజాలు బయటకు రావాలని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
Ponnavolu Sudhakar Reddy Comment
విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా నిపుణుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు. లడ్డూ కల్తీకి కారణమైన దోషులను రక్షించాలని తాము చెప్పడం లేదని.. . తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఏఆర్ ఫుడ్ ట్యాంకర్లు సరఫరా చేసిన 10 ట్యాంకర్లలో 14 రకాల పరీక్షలు చేయగా 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని టీటీడీ ప్రస్తుత ఈవో శ్యామలరావు తెలిపారని అన్నారు. కల్తీ జరిగింది అని గుర్తించిన 4 ట్యాంకర్లను వెనక్కు పంపించినట్లు ఆయనే చెప్పారని అన్నారు.. ప్రతి ట్యాంకర్ నుంచి మూడు వేర్వేరు శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహించారని చెప్పారు. ఆ మూడు రిపోర్టుల్లో కల్తీ జరగలేదని నిర్ధారణ జరిగిన తర్వాతే ట్యాంకర్ను లోపలకు అనుమతించారని స్పష్టం చేశారు. తమ దగ్గర కల్తీని నిర్ధారించే టెస్టింగ్ ల్యాబ్ లేదని టీటీడీ అధికారులు చెప్పడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. శర్మిష్ట అనే అధికారి టీటీడీకి వచ్చే నెయ్యిని ఎలా పరీశీలించారో చెప్పాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు.
Also Read : Supreme Court : తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి