Ponniyin Selvan : పొన్నియిన్ సెల్వ‌న్ కాసుల వేట

క‌లెక్ష‌న్ల‌లో బాక్సులు బ‌ద్ద‌లు

Ponniyin Selvan :  దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తీసిన పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రం కాసులు కొల్ల‌గొడుతోంది. బాక్సులు బ‌ద్ద‌లు కొడుతూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. శుక్ర‌వారం నాడు మూవీ విడుద‌లైంది. ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్ ఏకంగా రూ. 80 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.

ఇక రెండో రోజు కూడా ఇదే రీతిన వ‌సూళ్లు రాబ‌ట్టింది చిత్రం. ఇదే క్ర‌మంలో వ‌ర‌ల్డ్ వైడ్ గా పొన్నియిన్ సెల్వ‌న్ ఏకంగా రూ. 200 కోట్లకు వ‌సూలు చేసింది. ఇక ఐదో రోజు కూడా రికార్డు బ్రేక్ చేసింది. గ‌తంలో ఉన్న రికార్డుల‌ను కూడా బ్రేక్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది.

త‌మిళంలో స్ట్రెయిట్ సినిమాగా రూపొందించారు ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. పొన్నియిన్ సెల్వ‌న్(Ponniyin Selvan) ను భార‌తీయ భాష‌ల్లో అనువాదం చేశారు. ప‌ర భాషల్లోను మూవీ కాసులు కొల్ల‌గొడుతోంది. ప్ర‌స్తుతం వ‌రుస సెలువులు కావ‌డం, అందులోనూ ద‌స‌రా పండుగ రావ‌డంతో పొన్నియిన్ సెల్వ‌న్ దూసుకు పోతోంది.

విడుద‌లైన ప్ర‌తి థియేట‌ర్ లోను జ‌నం ఆద‌రిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ , నాగార్జున న‌టించిన ది దెయ్యం సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్నాయి. ఈ చిత్రాల ప్ర‌భావం పొన్నియిన్ సెల్వ‌న్ పై పడ‌నుంది.

ఇదిలా ఉండ‌గా కార్తీ, త్రిష‌, ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. మొత్తంగా స్క్రీన్ ప్లే ద‌గ్గ‌రి నుంచి టేకింగ్ , సంగీతం కాదా మ‌ణిర‌త్నం మార్క్ క‌నిపిస్తోంది.

Also Read : రూ. 200 కోట్లు దాటిన పొన్నియిన్ సెల్వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!