Pooja Hegde : తెలుగు వారి లోగిళ్లలో జీ తెలుగు ఓ సంచలనం. నిరంతరం ఆహ్లాదకరమైన ఆనందాన్ని అందించడంలో జీ తెలుగు(Pooja Hegde )ఎప్పటి లాగే ముందుంటోంది. ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
వర్ధమాన సినీ గాయనీ గాయకులను తయారు చేసింది. చిన్నారుల నుంచి పెద్ద వారి దాకా సరిగమప పేరుతో పరిచయం చేసింది. వారిలో నిగూఢమైన టాలెంట్ ను వెలికి తీసే ప్రయత్నం చేసింది.
జీ తెలుగు సౌత్ ఇండియా హెడ్ గా ఉన్న అనురాధ మోస్ట్ క్రియేటివ్ వ్యక్తిగా పేరొందారు. ఆమె ఏది చేసినా అదో సెన్సేషన్.
అందుకే తెలుగు బుల్లి తెర మీద జీ తెలుగు కొత్త ఒరవడితో ముందుకు వెళుతోంది.
ప్రస్తుతం స్టార్ మాతో పోటీ ఎదుర్కొంటోన్న జీ తెలుగు మరోసారి సరిగమప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దీనికి సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. అందరిదీ ఒకే కల అన్న క్యాప్షన్ తో జీ తెలుగు ఛానల్ ప్రోమోను కూడా విడుదల చేసింది.
ఇప్పటికే జీ తెలుగు 24 గంటలుతో ఛానల్ స్టార్ చేసి ఆగి పోయిన తర్వాత మళ్లీ జీ తెలుగు న్యూస్ డిజిటల్ మాధ్యమంలో ప్రారంభించింది.
ఇదిలా ఉండగా జీ తెలుగును సోనీ టేకోవర్ చేసుకుంది. అయితే ఎక్కువ వాటా శాతం మాత్రం జీ తెలుగుకే ఉండబోతోంది.
కాగా సరిగమప కొత్త కార్యక్రమం ఈనెల 20న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది.
ఈ విషయాన్ని జీ తెలుగు డిక్లేర్ చేసింది. ఈ మెగా లాంచ్ ఎపి సోడ్ కు ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీ నటి, బుట్ట బొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde )రాబతోంది.
ఇక ప్రాయోజిత సరిగమప షోకు యాంకర్ గా శ్రీముఖి, న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, దివంగత గాయకుడు ఎస్పీబీ చెల్లెలు ఎస్పీ శైలజ, సింగర్ స్మిత, రచయిత అనంత శ్రీరామ్ ఉంటారు.
ఈ షో ఈనెల 27 నుంచి రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.
Also Read : టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ నిజం