ICC Player Of The Month : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ డిక్లేర్
ప్రభాత్ జయసూర్య..ఎమ్మా లాంబ్
ICC Player Of The Month : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జూలై -2022 కు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారికంగా డిక్లేర్ చేసింది.
పురుషుల విభాగానికి సంబంధించి శ్రీలంక క్రికెట్ లో స్పిన్ మాంత్రికుడిగా పేరొందిన స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఎంపికయ్యాడు. ఇక మహిళల క్రికెట్ విభాగంలో ఇంగ్లండ్ జట్టులో కీలక పాత్ర పొషిస్తూ వస్తోంది ఎమ్మా లాంబ్.
ఆమెను ఎంపిక చేసింది ఐసీసీ. జయసూర్య, లాంబాను ప్లేయర్ ఆఫ్ ది మంత్(ICC Player Of The Month) గా ఎంపిక చేసింది. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన ఆస్ట్రేలియా సీరీస్ లో వచ్చీ రావడంతోనే 17 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించారు.
అద్భుతమైన ప్రతిభతో రాణించాడు. కళ్లు చెదిరే బంతులతో ముప్పు తిప్పలు పెట్టాడు. ఆపై ఆసిస్ తోనే కాదు పాకిస్తాన్ కు కూడా చుక్కలు చూపించాడు. ఈ సీరీస్ లో దుమ్ము రేపాడు.
మొదటి టెస్టులో పాకిస్తాన్ గెలిస్తే రెండో టెస్టులో శ్రీలంక ఘన విజయం సాధించింది. సీరీస్ సమం చేసింది. పాక్ ను ఓడించడంలో ప్రభాత్ జయసూర్య సత్తా చాటాడు.
ఇక జూలై నెలకు గాను ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెయిర్ స్టో , ఫ్రెంచ్ క్రికెటర్ గుస్తావ్ మెక్ కీన్ ను వెనక్కి నెట్టేసి అవార్డు రేసులో నిలిచాడు ప్రభాత్ జయసూర్య.
ఇక సఫారీ తో జరిగిన వన్డే సీరీస్ లో సత్తా చాటిన లాంబ్ దుమ్ము రేపింది. 234 రన్స్ చేసి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టింది.
Also Read : లక్ష్య సేన్ సంచలనం ‘పసిడి’ కైవసం