Prakash Indian Tata: 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలకు హాజరైన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు !

84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలకు హాజరైన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు !

Prakash Indian Tata: మనిషి నిత్య విద్యార్ధి అనేది ఎంత సత్యమో… వివిధ రకాల విద్యను అభ్యసించడానికి వయసు కూడా ప్రామాణికం కాదు అనేది కూడా అంత నిజం. ఈ నేపథ్యంలోనే పదిహేనేళ్ళకే పీ.హెచ్.డీ పట్టా పొందిన వారు ఉన్నారు… ఉద్యోగ విరమణ చేసిన తరువాత పీ.హెచ్.డీ చేసిన వారు ఉన్నారు. అయితే 84 ఏళ్ళ వయసులో ఎనిమిదో తరగతి పరీక్షలకు ఓ ఆయుర్వేద వైద్యుడు హాజరయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తుంది. దశాబ్దాల తరబడి వైద్యం అందించిన ఆయుర్వేద వైద్యుడు ఎనిమిదో తరగతి కూడా పాసవ్వలేదా అని కొందరు ప్రశ్నిస్తుంటే… ఈ వయసులో కూడా ఆయన నిర్భయంగా పరీక్షలకు హాజరవడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Prakash Indian Tata..

మధ్యప్రదేశ్‌ లోని ఛింద్‌వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్‌ ఇండియన్‌ టాటా(Prakash Indian Tata) 84 ఏళ్ల వయసులో ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘చదువుకు వయసుతో సంబంధం లేదని భావించాను. అందుకే నేను మొదట మధ్యప్రదేశ్‌ ఓపెన్‌ బోర్డు నుంచి ఐదో తరగతి పరీక్షలు రాశాను. ఇప్పుడు ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నా. ఆ తర్వాత 10, ఇంటర్‌ కూడా పూర్తి చేస్తాను’’ అని ప్రకాశ్‌ వెల్లడించారు. ఆయుర్వేద వైద్యంలో మంచి పట్టు సంపాదించిన ఆయన… సామాన్యుల నుంచి అమితాబ్‌ బచ్చన్‌ తదితర సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులు, అనేక దేశాల వ్యాపారవేత్తలకు సేవలు అందించారు. మొత్తం 112 దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు చికిత్స చేశారు. అయితే ఆయన ఎనిమిదో తరగతి కూడా పాసవ్వకపోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Also Read : Indian Army: ఇండియన్ ఆర్మీ చీఫ్ పదవీకాలం పొడిగింపు !

Leave A Reply

Your Email Id will not be published!