Prakash Raj Modi : మోదీపై ప్ర‌కాశ్ రాజ్ సెటైర్

త‌క్ష‌ణ‌మే చూపించండి

Prakash Raj Modi : సినీ ప‌రిశ్ర‌మ‌లో ధిక్కార స్వ‌రం ముందు నుంచీ వినిపిస్తున్న ఒకే ఒక్క‌డు ప్ర‌ముఖ న‌టుడు (prominent actor) ప్ర‌కాశ్ రాజ్(film industry). ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీని గ‌త కొంత కాలం నుంచీ టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు.

ఇటీవ‌లే వివేక్ అగ్ని హోత్రీ తీసిన ది క‌శ్మీర్ ఫైల్స్ పై కూడా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని(Prakash Raj Modi) ఉద్దేశించి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు ప్ర‌కాశ్ రాజ్. ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న మోదీని ఎద్దేవా చేశారు.

ఇటీవ‌ల ఆస‌క్తిక‌రమైన వ్యాఖ్య‌లు చేశారు మ‌హారాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ చంద్ర‌కాంత్ పాటిల్. ఆయ‌న మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్ తూర్పు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా మోదీని ఆకాశానికి ఎత్తేశారు.

అంతే కాదు ఈ దేశం కోసం ఏ ప్ర‌ధాని పాటు ప‌డ‌ని విధంగా కృషి చేస్తున్నార‌ని పేర్కొన్నారు. మ‌రో వైపు రోజుకు 24 గంట‌లు ఉంటే ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాల‌ని 22 గంట‌లు మాత్ర‌మే క‌ష్ట ప‌డుతున్నార‌ని చెప్పారు.

రోజుకు కేవ‌లం 2 గంట‌లు మాత్ర‌మే మోదీ నిద్ర పోతున్నారంటూ స్ప‌ష్టం చేశారు. దీంతో చంద్ర‌కాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

బీజేపీ , ఆర్ఎస్ఎస్, భ‌జ‌రంగ్ ద‌ళ్, విశ్వ హిందూ ప‌రిష‌త్, ఏబీవీపీ శ్రేణులంతా మోదీ జ‌య‌హో అంటూ కితాబు ఇచ్చాయి. దీనిపై తాజాగా ప్ర‌కాశ్ రాజ్ స్పందించారు.

నిద్ర పోక పోవ‌డం ఓ వ్యాధి కింద‌కు వ‌స్తుంద‌ని, దానిని వైద్య ప‌రిభాష‌లో ఇన్సోమ్నియా అంటార‌ని పేర్కొన్నారు. మీ నాయ‌కుడికి చూపించండి అంటూ సూచించారు ప్ర‌కాశ్ రాజ్.

Also Read : ఆర్ఆర్ఆర్‌పై ఉమైర్ సంధు ప్ర‌శంస‌లు

Leave A Reply

Your Email Id will not be published!