Prakash Raj : ఖిలాడీ నెంబర్ వన్
మోదీపై ప్రకాష్ రాజ్ ఫైర్
Prakash Raj : ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఆయన గత కొంత కాలం తన వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ , తదితర హిందూ భావ జాలాన్ని వెనకేసుకు వస్తున్న సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియ చేస్తున్నారు.
Prakash Raj Comments on PM Modi
తాజాగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో అంతర్జాతీయ స్టేడియంను నిర్మించేందుకు గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న శంకుస్థాపన చేశారు. ఇందులో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తో పాటు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గవాస్కర్, టెండూల్కర్, దిలీప్ వెంగ్ సర్కార్ , రవి శాస్త్రి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సచిన్ టెండూల్కర్ నమో భారత్ జెర్సీని ప్రత్యేకించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేశారు. ఇది వైరల్ గా మారింది. ఈ ఫోటోలను ప్రకాశ్ రాజ్(Prakash Raj ) పంచుకున్నారు. ఈ దేశంలో నెంబర్ ఖిలాడీ ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ తప్ప ఇంకొకరు కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Vijay Sai Reddy : 40 ఏళ్లుగా ప్రజా ధనం లూటీ