Prashant Kishor : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది.
మోదీని ప్రధానమంత్రిగా చేయడం వెనుక మాస్టర్ స్ట్రాటజీ ఒకే ఒక్కడు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఉన్నారనేది వాస్తవం. దేశంలోని 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి.
నాలుగు రాష్ట్రాలలో బీజేపీ సత్తా చాటింది. ఇక అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు కోల్పోయింది. ఇక్కడ 117 సీట్లలో 92 సాధించి ఆమ్ ఆద్మీ పార్టీ పవర్ లోకి వచ్చింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది. ఆ పార్టీ తీవ్ర అంతర్గత కుమ్ములాటలతో కొట్టు మిట్టాడుతోంది.
పార్టీని అంటి పెట్టుకున్న సీనియర్ నాయకులు ఒక్కొరొక్కరు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
మరో వైపు గాంధీ ఫ్యామిలీని వ్యతిరేకించే జీ23 టీమ్ కారాలు మిరియాలు నూరుతోంది.
పైకి లేదని చెప్పినా లోలోపట కుతకుత లాడుతున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పీకే అవసరం వచ్చి పడింది.
ఆయన గతంలో రెండు సార్లు గాంధీ ఫ్యామిలీతో భేటీ అయ్యారు. పోయిన పరువు నిలబెట్టు కునేందుకు,
తిరిగి పవర్ లోకి వచ్చేందుకు ఎలాంటి స్ట్రాటజీస్ అమలు చేయాలనే దానిపై ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఢిల్లీలో కీలక చర్చలు జరిపారు.
ఈ సందర్బంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపు 4 గంటలకు పైగా ఈ సమావేశం జరగడం విశేషం.
ప్రధానంగా 370 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలని , మిగతా చోట్లా పొత్తులు పెట్టు కోవాలని సూచించినట్లు సమాచారం.
ఇందుకు సంబంధించి ఏమేం వ్యూహాలు అనుసరించాలి. ఎలాంటి ఎత్తుగడలు వేయాలనే దానిపై కూడా పేర్కొన్నారు.
ఇందుకు గాను ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన బ్లూ ప్రింట్ పై అధ్యయనం చేసేందుకు అధ్యయనానికి అంతర్గత కమిటీని నియమించారు సోనియా గాంధీ.
ఈ సందర్భంగా పీకేను కాంగ్రెస్ హై కమాండ్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఓకే చెప్పినట్లు టాక్.
ఇక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఏమేం స్ట్రాటజీని అనుసరించాలనే దానిపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చినట్లు టాక్.
పీకే బ్లూ ప్రింట్ ఇచ్చిన విషయం గురించి పార్టీ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ధ్రువీకరించారు.
Also Read : కుల్దీప్ సేన్ కమాల్ కర్ దియా