Prasidh Krishna IPL 2022 : చుక్కలు చూపించిన ప్రసిద్ద్ క్రిష్ణ
మరోసారి నిరాశ పరిచిన కోహ్లీ
Prasidh Krishna IPL 2022 : సెమీ ఫైనల్ గా భావించిన ఐపీఎల్ 2022 క్వాలిఫయిర్ -2 మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 14 ఏళ్ల సుదీర్గ కాలం అనంతరం ఫైనల్ కు చేరింది.
29న అహ్మదాబాద్ మోదీ మైదానంలో గుజరాత్ టైటాన్స్ తో టైటిల్ కోసం పోటీ పడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను మట్టి కరిపించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చుక్కలు చూపించింది రాజస్తాన్ రాయల్స్ .
జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతడి నిర్ణయం 100 శాతం కరెక్టేనని నిరూపితమైంది. శాంసన్ తమపై ఉంచిన నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయలేదు బౌలర్లు.
టైటాన్స్ తో జరిగిన తప్పుల్ని గుర్తించి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆర్సీబీ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. అన్ క్యాప్డ్ ప్లేయర్ రజత్ పటిదార్ ఒక్కడే రాణించాడు.
రియాన్ పరాగ్ క్యాచ్ పట్టి ఉంటే ఆర్సీబీ 100 పరుగులకే పరిమితమై ఉండేది. ఆ ఒక్క క్యాచ్ జార విడచడంతో 58 పరుగులు చేశాడు రజత్ పటిదార్.
ఇక టాస్ ఓడి బరిలోకి దిగిన ఆర్సీబీని దెబ్బ కొట్టాడు ఆర్ఆర్ బౌలర్ ప్రసిద్ద్ క్రిష్ణ(Prasish Krishna IPL 2022).
స్టార్ ప్లేయర్, ఓపెనర్ విరాట్ కోహ్లీని అద్భుతమైన బంతికే పెవిలియన్ దారి పట్టించాడు. సంజూ శాంసన్ క్యాచ్ పట్టడంతో 7 పరుగులే చేసి
నిరాశ పరిచాడు. మరో డేంజరస్ బ్యాటర్ గా పేరొందిన దినేశ్ కార్తీక్ ను 6 పరుగులకే ఔట్ చేశాడు క్రిష్ణ.
రియాన్ పరాగ్ క్యాచ్ పట్టాడు. ఇక కళ్లు చెదిరే యార్కర్ వేసి హసరంగను బౌల్డ్ చేశాడు. దీంతో ప్రసిద్ద్ క్రిష్ణ(Prasish Krishna IPL 2022) 4
ఓవర్లు వేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read : ఐపీఎల్ రూల్ ను ఉల్లంఘించిన దినేష్ కార్తీక్