Pratibha Shukla : టమాటా ధరలు పెరిగితే తినొద్దు – రూ.150
యూపీ మంత్రి ప్రతిభా శుక్లా
Pratibha Shukla :భారతీయ జనతా పార్టీకి చెందిన ఉత్తర ప్రదేశ్ మహిళా, శిశు పోషకాహార శాఖ సహాయ మంత్రి ప్రతిభా శుక్లా(Pratibha Shukla) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకంగా కిలో టమాటా ధర రూ. 150 నుంచి రూ. 180 రూపాయలు పలుకుతోంది. బహిరంగ మార్కెట్ లో టమాటాలు దొరకడం లేదు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు విస్తు పోయేలా సమాధానం చెప్పారు మంత్రి.
Pratibha Shukla Asking
టమాటా ధరలు పెరిగితే ప్రభుత్వం ఏం చేస్తుంది. భారం అనిపిస్తే తినడం మానేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు ప్రతిభా శుక్లా. లేదంటే ఇంట్లోనే పండిచుకునే ప్రయత్ంన చేయాలని సూచించారు. టమాటాలకు బదులు నిమ్మకాయలు వాడాలని అన్నారు యూపీ మంత్రి. ఎవరూ తినకుండా ఉంటే టమాటా ధరలు వాటంతట అవే దిగి వస్తాయంటూ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం టమాటా ధరలపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రతిభా శుక్లా వైరల్ గా మారారు. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశారు. ఒక మంత్రిగా ఉంటూ ఇలాంటి బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ జనం ప్రశ్నిస్తున్నారు. నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. వెంటనే బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు.
Also Read : Jogi Ramesh : పవన్ పిచ్చి కుక్క బాబు గుంట నక్క